తిరుపతి గోవిందరాజస్వామి ధ్వజారోహణం ఘనంగా జరిగింది. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను తితిదే ప్రారంభించింది. మేషలగ్నంలో గజపటాన్ని ధ్వజస్థంభంపైకి ఎగురవేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు తితిదే ఆహ్మానించింది. వేద పండితుల వేదమంత్రోఛ్చారణల మధ్య వైభవోపేతంగా ధ్వజరోహణ ఘట్టం జరిగింది.
తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారు ఒక్కో వాహనంపై వూరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సంధర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తితిదే అలంకరించింది. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అధికసంఖ్యలో భక్తులు ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తితిదే ఈఓ సాంబశివరావు, జెఈఓ పోలా భాస్కర్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు.