Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహా ఏమి వైభవం, రెండుసార్లు గరుడసేవ

ఆహా ఏమి వైభవం, రెండుసార్లు గరుడసేవ
, సోమవారం, 9 ఆగస్టు 2021 (20:31 IST)
తిరుమలలో శ్రీవారి ఉత్సవాలకు కొదవే లేదు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న విధంగా తిరుమలలో ఎప్పుడు ఉత్సవాలు కొనసాగుతూనే ఉంటాయి. వెంకటేశ్వర స్వామిని ఉత్సవ మూర్తిగా కూడా పిలుస్తుంటారు. అయితే అలాంటి తిరుమలలో స్వామివారికి కారణంగా ఉత్సవాలన్నింటిని ఏకాంతంగానే టీటీడీ నిర్వహిస్తూ వస్తోంది.
 
శ్రీనివాసుని వాహన సేవలో ముఖ్యమైనది గరుడసేవ. గరుత్మంతుడిపై  శ్రీవారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఎప్పుడు పౌర్ణమి రోజు గరుడ సేవ జరిగినా.. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవాలు జరుగుతున్నా భక్తులు ఖచ్చితంగా తిరుమలకు వస్తారు. ఆ స్వామి వారి గరుడ సేవను తిలకిస్తూ ఉంటారు. అలాంటి గరుడసేవ ఈ నెల రెండు సార్లు జరుగుతోంది.
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 13వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
 
ఆగస్టు 13వ తేదీన‌ గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు. ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం.
 
ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణమాసం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే.. నవగ్రహాలు శాంతిస్తాయట