Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి నగలను లెక్కించిన తితిదే: త్వరలో హైకోర్టుకు నివేదిక!

Advertiesment
శ్రీ వేంకటేశ్వర స్వామి
, శుక్రవారం, 31 డిశెంబరు 2010 (12:38 IST)
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంటేశ్వర స్వామి ఆభరణాలను మాయమవుతున్నాయని ఆరోపణలు వెలువెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆభరణాలతో వెలువెత్తిన అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే శ్రీవారి నగలను లెక్కించిన తితిదే, త్వరలో హైకోర్టును నివేదిక కూడా సమర్పించనుంది.

ఈ క్రమంలో శ్రీవారి ఆభరణాలు మాయమైపోలేదని, వెంకన్న ఆభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయని తితిదే పేర్కొంది. ఆభరణాల విషయంలో ఎలాంటి పొరపాటు జరగలేదని జస్టిస్ వాద్వా, జన్నాథరావు కమిటీలు సంతృప్తి వ్యక్తం చేసింది. తితిదే నగదు రికార్డులను సరిచూసిన జస్టీస్ కమీటి అన్నీ సరిగ్గానే ఉన్నాయని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఎంతో పురాతన చరిత్ర కలిగిన శ్రీకృష్ణదేవరాయుల నగలు మాయమైన సంగతి తెలిసిందే. ఈ నగలను మింట్‌లో కరిగించి డాలర్లు తయారు చేశామని తితేదే చెప్పడం, రాయల నగలు ఉన్నట్లు రికార్డులే లేవని తితిదే చెప్పడంపై పలు అనుమానాలు వెలువెత్తాయి.

Share this Story:

Follow Webdunia telugu