భక్తులతో పోటెత్తిన మల్లికార్జున స్వామి ఆలయం
శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని పలు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇందులో భాగంగా.. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్రల నుంచి సుమారు 45వేల మంది భక్తులు స్వామివార్లను దర్శించుకున్నట్లు ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.శ్రావణమాసంలో వచ్చే సోమవారాల్లో నీలకంఠుడైన శివ పరమాత్మను దర్శించుకుంటే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం నాడు స్వామిని దర్శించుకునే వారికి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది.