Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వమత ప్రజల భక్తి విశ్వాసాల ప్రతీక ఆజ్మీర్ దర్గా

Advertiesment
అజ్మీర్ షరీఫ్‌ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గా భారత దేశం అత్యంత ప్రాధాన్యత ముస్లీం
WD PhotoWD
అజ్మీర్ షరీఫ్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గా భారత దేశంలోని అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ముస్లీం పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్నది. సర్వమతాల ప్రజల భక్తివిశ్వాసాలను ఈ దర్గా చూరగొంటున్నది. ముస్లీం మతాచార్యుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ సమాధి చెందిన స్థలమే అజ్మీర్ షరీఫ్ దర్గాగా రూపాంతరం చెందింది.

భారత్ మరియు పాకిస్థాన్ దేశాలలోని అత్యంత ప్రముఖమైన సూఫీ సంఘాలకు చెందిన చిస్టీ సూఫీ పరంపరను హజ్రత్ మొయినుద్దీన్ చిస్టీ వ్యవస్థాపించారు. తమ ధార్మిక చింతన, ఆకర్షణ శక్తి, దీవెనలు మరియు సేవల ద్వారా సూఫీ బోధకులు ఇస్లాం మతవ్యాప్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 1190 సంవత్సరం నుంచి తాను దేహాన్ని త్యజించే వరకు అనగా 1232 సంవత్సరం దాకా మొయినుద్దీన్ అజ్మీర్‌లో జీవించారు.

మరణానంతరం సైతం మొయినుద్దీన పట్ల గల పూజ్యభావం వారి సమాధి పొందే ప్రాపకం రూపంలో వీక్షించవచ్చు. సమాధి శిఖరంపై ప్రతిష్ఠితమైన కిరీటం
WD PhotoWD
స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఇక కంటికి ఎదురుగా కనిపించే ఖాళీ స్థలంలో ఒక మసీదును మొఘల్ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొంత కాలవ్యవధిలో దర్గాను నిర్మించే క్రమంలో పలువురు మొఘల్ పాలకులు తమ వంతు కృషిని చేసారు. ఒకానొకప్పుడు సాధారణ స్థితిలో ఉన్న మతాచార్యుని సమాధి, నేడు ఒక దర్గాగా రూపాంతరం చెందినదై పలు మసీదులు, మండపాలు మరియు సింహద్వారాలకు నెలవైన అతి పెద్ద సముదాయంగా అవతరించింది.

WD PhotoWD
దర్గా ప్రవేశానికి ఉద్దేశించిన దర్గాబజార్ ప్రధానమైన అంతర్ ఆవరణలోనికి దారి తీస్తుంది. దర్గాకు చెందిన వెండి ద్వారాలు అధ్బుతంగా రూపొందించబడ్డాయి. మతాచార్యుని సమాధిని ఆవరించినట్లుగా ఒక వెండి కంచె మరియు ఒక పాక్షిక చలువరాతి తెర ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకించిన ప్రార్ధనామందిరం కూడా ఇక్కడ ఉన్నది.

అజ్మీర్ షరీఫ్ దర్గా సందర్శనార్ధం ముస్లింలతోపాటుగా అన్యమతస్థులు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తుంటారు. ఇక మొయినుద్దీన్ చిస్టీ పరమపదించిన రోజున అనగా ఉరుసు సమయంలో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య లక్షలకు చేరుకుంటుంది.

ఉరుసు చివరి మూడురోజులు కేవలం భారతదేశానికి చెందిన భక్తులనే కాక ఇతర దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన భక్తులను సైతం ఆకర్షిస్తాయి.
WD PhotoWD
అజ్మీర్‌లోని దర్గా షరీఫ్‌కు విచ్చేసే భక్తులు రిక్త హస్తాలతో వెనుకకు వెళ్ళరని చెప్పబడింది. ప్రతి సందర్శకుని ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయి.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తమ కోరికలు తీరిన భక్తులు, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలోని పుణ్య సమాధికి చదర్ (వెల్వెట్ వస్త్రం), పుష్పాలు, ఐత్రా (సుగంధ పరిమళ ద్రవ్యాలు) మరియు చందనాన్ని సమర్పించుకుంటారు. మతాచార్యుని కీర్తిస్తూ ఖవ్వాలీ పాటలు పాడుతారు.

WD PhotoWD
మతాచార్యుని సేవకులైన ఖదీమ్‌లు పర్యాటకులకు కావలసిన సదుపాయాలను సమకూరుస్తారు. రాజస్థాన్‌ను సందర్శించే దాదాపు ప్రతి పర్యాటకుని మజిలీలలో ప్రధానమైన మజిలీగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రఖ్యాతి పొందింది. ఈ దర్గాను సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు.

ఎలా సందర్శించాలి:
రైలు ద్వారా: పశ్చిమ రైల్వే యొక్క ఢిల్లీ అహ్మదాబాద్ విభాగానికి చెందిన రైల్వే జంక్షన్ అయిన అజ్మీర్‌, రాజస్థాన్‌లోని ప్రధాన పట్టణాలకు అనుసంధానించబడింది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోడ్డు ద్వారా: జైపూర్ (135 కి.మీ.), జోధ్‌పూర్ (198 కి.మీ.) మరియు ఢిల్లీ (335 కి.మీ.) నుంచి మీకు బస్సులు లభిస్తాయి. ఉరుసు సమయంలో దేశంలోని అన్ని నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపబడతాయి.

పదకోశం:
దర్గా - పుణ్య సమాధి.

Share this Story:

Follow Webdunia telugu