Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శక్తి పుణ్యక్షేత్రం...పావగఢ్ శక్తి పీఠం

Advertiesment
గుజరాత్ రాష్ట్రంలోని ప్రధానమైన మూడు శక్తి పీఠాలుగా అరసుర్‌లోని అంబాజీ
WD PhotoWD
గుజరాత్ రాష్ట్రంలోని ప్రధానమైన మూడు శక్తి పీఠాలుగా అరసుర్‌లోని అంబాజీ, చున్వల్‌‌కు చెందిన బాల మరియు చంపనేర్‌కు సమీపంలోని పావగఢ్‌లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. కచ్‌లోని అసపురా, మౌంట్ ఆబూ‌కు చెందిన అర్బుదదేవి, హల్వాడ్‌లోని సుందరీ, హర్‌సిద్ధికి చెందిన కోల్‌గిరి లేదా కోయ్‌లా మరియు నర్మదా తీరాన అనసూయలు గుజరాత్‌లోని ఇతర శక్తి పుణ్య క్షేత్రాలుగా భక్తుల పూజలను అందుకుంటున్నాయి. ఈ పావగఢ్‌... గుజరాత్‌కు ఒకప్పటి రాజధానిగా పేరొందిన చంపనేర్‌కు సమీపంలో వడోదరాకు 50 కి.మీ.ల దూరంలో పావగఢ్ శక్తి పీఠం నెలకొంది.

దక్షయజ్ఞ విధ్వంసం, శివుని రుద్ర తాండవం సందర్భంగా సతీ దేవీ దేహ భాగాలు భారతదేశంలోని పలు ప్రాంతాలలో పడ్డాయి. అటువంటి ప్రాంతాలు శక్తి పీఠాలుగా ప్రాచుర్యాన్ని పొందాయి. అదే సమయంలో సతీ దేవీ ఎడమ వక్ష భాగం ఇక్కడ పడిందని భక్తుల విశ్వాసం. వార్షిక నవరాత్రి ఉత్సవాలలో పర్వతంపై కొలువైన
WD PhotoWD
దేవాలయం భక్తులను పెద్దసంఖ్యలో ఆకర్షిస్తుంది.

ఏకాంతంగా కనిపిస్తూ, అన్ని వైపులా చల్లని గాలులను వెదజల్లే పర్వతంగా ప్రజలను ఆకట్టుకోవడంతో ఈ పర్వతానికి పావ్‌గఢ్ అనే పేరు సార్థకమయ్యింది. పురాణేతిహాసాలను అనుసరించి పావ్‌గఢ్‌ను ఆవరించిన లోయ విశ్వామిత్రుని శక్తితో నిండి ఉంటుంది. అంతేకాక ఇక్కడి కాళికా మాత విగ్రహాన్ని విశ్వామిత్రుడు ప్రతిష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. విశ్వామిత్రి నది ఇక్కడనే ఆవిర్భవించింది.

WD PhotoWD
దక్షిణ కాళీగా ఇక్కడి కాళీ మాతను కొలుచుకునే భక్తులు దక్షిణ మార్గంలో వైదిక మరియు తాంత్రిక పద్ధతులలో అమ్మవారిని పూజిస్తుంటారు. నవరాత్రి కాలంలో అనేక ఉత్సవాలు ఇక్కడ కనులపండువగా జరుగుతుంటాయి.

చంపనేర్ కోట అక్కడ జరిగిన అనేక యుద్ధాలకు సాక్షిభూతంగా నిలుస్తోంది. యదార్థానికి రాజపుత్రుల ఏలుబడిలో ఒక వెలుగు వెలిగిన చంపనేర్ నగరం, 15వ శతాబ్దంలో గుజరాత్ ప్రాంతానికి చెందిన సుల్తాన్‌ల అధీనంలోకి వెళ్ళిపోయింది. అనంతరం హుమయూన్ పాలనలోకి వచ్చిన చంపనేర్, సుల్తాన్ బహుదూర్ షా, అక్బర్, మరాఠాల చేతులు మారి చివరకు బ్రిటీషు వారి పాలనలోకి చేరుకుంది.

చంపనేర్ నుంచి బయలుదేరే ఒక పర్వత మార్గం పావగఢ్‌కు దారి తీస్తుంది. మహాకాళి దేవాలయం కాళికా మాత రూపాన్ని తలపిస్తుంది, అక్కడ మహాకాళి రూపంతో పాటు బహుచర దేవత యంత్రం భక్తులను దీవిస్తూ కనిపిస్తుంటాయి. దేవాలయానికి వెళ్లే దారిలో ఛాసియా మరియు దుధియా తాలవో సరస్సులు భక్తులకు మానోల్లాసాన్ని కలిగిస్తుంటాయి.

చంపనేర్ నుంచి మూడు దశలలో పావగఢ్ పర్వతం ఏర్పడింది. మాచి హవేలిగా పేరున్న పీఠభూమి సముద్ర మఠానికి 1471 అడుగుల ఎత్తున ఉంది. రాష్ట్ర రోడ్డు
WD PhotoWD
రవాణా సంస్థ బస్సులు మాచి వరకు కొనసాగించబడ్డాయి. చిన్నపాటి హోటళ్ళు మరియు విశ్రాంతి గృహాలు మాచిలో దొరుకుతాయి. టెలియ టలవ్ మరియు దుధియా టలవ్‌లు మాచికి పైభాగాన ఉన్నాయి.

ప్రఖ్యాతి చెందిన మహాకాళి దేవాలయం పర్వత శిఖరాగ్రంపై కొలువై ఉన్నది. మహాకాళి మాత దేవాలయం చేరుకునేందుకు మాచి నుంచి రోప్-వే సదుపాయం ఉంది. అక్కడ నుంచి 250 మెట్లు ఎక్కి దేవాలయాన్ని సందర్శించవచ్చు. దేవాలయం పైభాగంలో ముస్లిం భక్తులు సందర్శించే పీర్ ఆదాన్‌షాహ్ దర్గా ఉంది.

పావగఢ్ చేరుకునే మార్గం:

విమానం ద్వారా :
సమీపంలోని విమానాశ్రయాలుగా ఇక్కడ నుంచి 190 కి.మీ.ల దూరంలో గల అహ్మదాబాద్ మరియు 50 కి.మీ.ల దూరంలో వడోదరా

రైలు ద్వారా :
అహ్మదాబాద్‌ను ముంబైతో కలిపే తూర్పు రైలు మార్గంలో వడోదరా ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు మరియు ప్రైవేటు వాహనముల ద్వారా వడోదరా నుంచి పావగఢ్ చేరుకోవచ్చు.

రోడ్డు ద్వారా :
గుజరాత్‌లోని అనేక నగరాల నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు మరియు ప్రైవేటు వాహనముల ద్వారా పావగఢ్ చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu