Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుణ్యప్రదం... శబరిమలయాత్ర!

Advertiesment
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతియేటా భక్తకోటి
WD PhotoWD
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతియేటా భక్తకోటి సందర్శిస్తుంటారు. ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్య క్షేత్రాల జాబితాలో హజి్‌లోని మక్కా మసీదు ప్రథమ స్థానంలో ఉంటే.. శబరిమలది రెండోస్థానం అని చెప్పవచ్చు. గత ఏడాది నవంబరు నుంచి మొన్నటి జనవరి వరకూ ఈ ఆలయాన్ని దాదాపు ఐదుకోట్ల మంది భక్తులు సందర్శించినట్లు అంచనా.

శబరిమలలో కొలువైవున్న అయ్యప్ప స్వామి క్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. కేరళ పశ్చిమ కొండ పర్వతప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనమ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది.

శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్టించినట్లు చెపుతారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన ఓ కథ ప్రకారం.... శివకేశవులకు కలిగి
WD PhotoWD
సంతానం అయ్యప్పస్వామి. భస్మాసుర సంహారినికి మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివుడు ఆమెతో సంగమిస్తాడు. వీరురివురికి ఓ అందమైన బాలుడు కలుగుతాడు.

వంశాంకురం కోసం తపస్సు చేస్తున్న పాండలం ప్రాంత రాజు ప్రార్థించే దట్టమైన అడవులలో ఆ బాలుణ్ణి వదిలి వెళతారు శివకేశవులు. ఆ అందమైన బాలుని తన సంతానంగా భావించి అతనిని అన్ని విద్యలలోనూ ఉన్నతునిగా తీర్చిదిద్దుతాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమలకు సంబంధించి నవంబర్ 15న వచ్చే మండలపూజ, జనవరి 14న వచ్చే మకర‌జ్యోతి అతి ముఖ్యమైన ఘట్టాలు. వీటితోపాటు ఏప్రిల్ మాసంలో వచ్చే విషు మరియు ప్రతి మలయాళం మాసంలో మొదటి ఐదురోజులు మినహా మిగతా కాలమంతా ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు.

WD PhotoWD
భక్తులు ఇరుముడిలో తీసుకునివచ్చే పవిత్రమైన నేయిని అయ్యప్పస్వామి విగ్రహంపై పోసే విధానంలో ఓ సత్యం దాగి ఉంది. పరమాత్మతో జీవాత్మ కలిసిపోవటాన్ని ఇది సూచిస్తుంది.

అహం బ్రహ్మాస్మి అని సంస్కృతంలో చెప్పినట్లుగా ఈ దేవాలయం సందర్శన మీలోనూ దేవుడున్నాడన్న ముఖ్య సందేశాన్నిస్తుంది. అందువలనే ప్రతి భక్తుడు ఒకరికొకరు స్వామి అని పిలుచుకోవటానికి వెనుకగల అర్థమిదే. తత్వమాసి...అంటే నీవు సందేశం అయితే, ఆ సందేశాన్ని ఇచ్చేది భగవంతుడే. అద్వైతంలో చెప్పినట్లుగా ఈ విశ్వాంతరాళంలో నీవు ఒక భాగానివని అర్థం.

శబరిమలలో మకరజ్యోతి పూజ అత్యంత ప్రసిద్ధమైంది. ఈ పూజానంతరం పవిత్రమైన మకరజ్యోతి వెలుగు ఆకాశాన అన్నట్లు కొండల శిఖరాగ్రాన భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అపూర్వమైన ఘట్టంతో శబరిమల తీర్థయాత్ర ముగుస్తుంది.

శబరిమల పూజను ఆచరించే భక్తులు కొన్ని కఠిన నియమాలు పాటించాల్సి వుంటుంది. మండలపూజను ఆచరించే భక్తులు 41 రోజులపాటు నిష్ఠగా ఉండాలి.
WD PhotoWD
పూజాకాలంలో భక్తులు మాంసాహారం, ఇహపర సౌఖ్యాలకు దూరంగా ఉండాలి.

అయ్యప్ప స్వామి భక్తులు బృందాలుగా బయలుదేరతారు. ప్రతి సమూహానికి ఓ అధిపతి ఉంటాడు. ప్రతి భక్తుడు ఇరుముడి కట్టుగా పిలువబడే క్రొత్త దుస్తుల మూటను తెస్తాడు. కులం, మతం అంటూ కొన్ని హిందూ దేవాలయాలలో ప్రవేశానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నట్లుగా శబరిమల ఆలయంలో లేవు. 10 మరియు 50 ఏళ్ల పైబడిన మహిళలకు( రజస్వలకాని మరియు మెనోపాజ్‌లో ఉన్నవారు) తప్ప, మిగిలినవారికి ప్రధాన ఆలయంలోనికి ప్రవేశం లేదు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
ఆలయానికి సమీపంలో తూర్పువైపున సన్నిధానం అనే ప్రాంతం ఉంది. దీనిని వావర్‌కి అంకితం చేయబడింది. ముస్లిం అయినటువంటి, వావరునాధగా పిలిచే ఈయనను అయ్యప్ప స్వామికి సహచరుడుగా భావిస్తారు. ఈ దేవాలయాన్ని హిందువేతరులు సందర్శిస్తుంటారు.

ఎప్పుడు వెళ్లాలి
శబరిమల యాత్ర ప్రధానంగా నవంబరు నుంచి జనవరి మాసం వరకూ జరుగుతుంది. 41 రోజుల వ్రతం చేసే అయ్యప్ప భక్తులు దీక్షాకాలంలో కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మాంసాహారం, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండాలి.

నల్లటి చొక్కా, లుంగీ లేదా పంచెను ధరించాలి. కంఠ మాలను ధరించాలి. పరిశుభ్రానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. నేయితోనూ మరియు ఇతర పూజా సామగ్రితోనూ నిండిన ఇరుముడిన కలిగి ఉన్న భక్తులనే అయ్యప్ప స్వామి ఆలయంలోని 18 మెట్లను ఎక్కేందుకు అనుమతినిస్తారు.

శబరిమల యాత్ర సఫలం చేసుకునేందుకు ట్రావెన్‌కోర్ (టిడిబి) ఆమోదయోగ్యమైన ధరలకే అన్ని వసతి సౌకర్యాలను కల్పిస్తుంది. అయితే ప్రత్యేకించి దర్శనీ
WD PhotoWD
కాలాలలో ఇక్కడ వసతి దొరకటం కష్టమే.

శబరిమలను చేరుకోవడమెలా...
పంపా వరకూ వాహనాలు వెళతాయి. ఆ తర్వాత దాదాపు 4 కిలోమీటర్ల కాలిబాటన కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం ప్రస్తుతం అంతా సిమెంటుచేయబడింది. మార్గం ప్రక్కనే చిన్నచిన్న హోటళ్లు, తాత్కాలిక షాపులు, షిప్టు పద్దతిలో నిర్వహించే హోటళ్లు ఉన్నాయి. వీటితోపాటు వైద్య సహాయం కూడా అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే రోగులు శబరిమల యాత్రను చేయకూడదని తెలియజేయటమైంది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమలకు దగ్గరి రైలు స్టేషన్లు కొట్టాయం మరియు చెంగన్నుర్ (93 కి.మీ). అన్ని రైళ్లు త్రివేండ్రం వయా ఎర్నాకులం స్టేషన్లను తాకుతూ ఈ స్టేషన్లకు చేరతాయి.

ఇక తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 175 కిలోమీటర్ల దూరంలో శబరిమల ఉంది. అలాగే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu