Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవాస్‌లో కొలువు తీరిన భవాని మాతలు

దేవాస్‌లో కొలువు తీరిన భవాని మాతలు
FileFILE
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ నగరం తులజా భవాని, చాముండ మాత ఆలయాలకు ప్రసిద్ధి పొందింది. ఈ నగరంలోని చిన్న పర్వతంపై ఈ రెండు ఆలయాలు వెలిశాయి. ఈ దేవతలు పెద్దమ్మవారు, చిన్నమ్మవారు అనే పేర్లతో ప్రసిద్ధులయ్యారు. ఈ ఇద్దరు దేవతలూ అక్కచెల్లెళ్లని ఈ ఆలయం పూజారి చెప్పారు. ఒకసారి ఈ ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ఫలితంగా పెద్దమ్మవారు ఆలయం వదలి చిన్నమ్మవారు వెలిసి ఉన్న కొండకు మరోవైపుకు వెళ్లిపోయింది.

ఈ పరిస్థితి గమనించిన హనుమంతుడు మరియు భైరవుడు ఈ ఇద్దరు దేవతలను ఈ స్థలం వదిలి పోవద్దని కోరారు. అప్పటికే పెద్దమ్మవారి శరీరంలో సగభాగం నేలలో కూరుకుపోయింది. ఇలా చిట్ట చివరలో వారు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో వారి విగ్రహాలు ఈ నాటికీ కనిపిస్తుంటాయి.

చాలాకాలంగా సాగుతున్న విశ్వాసం ప్రకారం ఈ విగ్రహాలు స్వయం భూ విగ్రహాలు అని జనం నమ్ముతున్నారు. స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థిస్తే అలాంటి వారి కోరికలు ఇక్కడ నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. చరిత్ర ప్రకారం దేవాస్ నగరాన్ని ఏకకాలంలో రెండు రాజవంశాలు పాలించాయి. ఒకటి హోల్కర్ రాజవంశం రెండ
webdunia
FileFILE
పన్వార్ రాజవంశం. తులజా భవాని హోల్కర్ రాజవంశాన్ని రక్షించే దేవత కాగా, చాముండా దేవి పన్వార్ రాజవంశాన్ని సంరక్షించే దేవత.

ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు భైరవదేవుడిని కూడా పూజిస్తారు. ఎందుకంటే భైరవుడికి మొక్కుకోకుంటే ఆలయంలో పూజ పూర్తయినట్లు కాదని నమ్మకం. నవరాత్రుల్లో ఈ ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. ఆ రోజుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు.

ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా...

విమానమార్గం - సమీప విమానాశ్రయం ఇండోర్-35 కిలోమీటర్లు-లో ఉంది.

రోడ్డుమార్గం - ఈ ఆలయం ఆగ్రా-ముంబై ఎన్‌హెచ్3లో ఉంది. ఇండోర్, ఉజ్జయిని పట్టణాలకు 35 కి.మీ దూరంలో ఉంది.

రైలుమార్గం - ఇది ఇండోర్-ఉజ్జయిని బ్రాడ్ గేజ్ లైన్‌లో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu