Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాకోర్‌లోని రంఛోడ్‌రాయ్‌జీ దేవాలయం

Advertiesment
గుజరాత్ రాష్ట్రం ఖేడా జిల్లా డాకోర్ మహాశివుని డంక్‌నాథ్ దేవాలయం
, ఆదివారం, 25 నవంబరు 2007 (17:45 IST)
WD PhotoWD
గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో డాకోర్ ఉన్నది. మహాశివుని డంక్‌నాథ్ దేవాలయం ఇక్కడ ఉండటంతో డాకోర్‌, డంకాపూర్‌గా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ. 1722 సంవత్సరంలో శ్రీకృష్ణుడు కొలువైన రంఛోడ్‌రాయ్‌జీ దేవాలయం నిర్మాణంతో ప్రముఖ పుణ్యక్షేత్రంగా డాకోర్ వాసికెక్కింది.

మధురలో జరాసంధునితో యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడు యుద్ధక్షేత్రం నుంచి పారిపోవడంతో శ్రీకృష్ణునికి రంఛోడ్ అనే పేరు సార్థకమయ్యింది. ద్వారకలోని ద్వారకాదీశుని దైవత్వాన్ని సంతరించుకున్న రంఛోడ్‌జీ విగ్రహం కూడా నల్లరాయితో నిర్మితమైనదే. దర్శనానికి వచ్చే భక్తులు, విగ్రహం పాదం తాకడానికి
WD PhotoWD
అనుమతించబడతారు. దేవాలయ సందర్శన ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతిస్తారు.

అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 06:45 గంటలకు మంగళహారతిని ఇస్తారు. భక్తుల సమక్షంలోనే రంఛో‌డ్‌జీ అలంకరించబడతాడు. మంగళభోగ్, బాల్‌భోగ్, శ్రీనగర్‌భోగ్, గ్వాల్‌భోగ్ మరియు రాజ్‌భోగ్‌లతో ఉదయం పూట హారతిని ఇస్తారు. మధ్యాహ్న సమయాన ఉస్థపాన్‌భోగ్, శ్యామ్‌భోగ్ మరియు శక్తిభోగ్‌లతో హారతిని ఇస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

WD PhotoWD
ప్రతి సంవత్సరం 35 దేవాలయ ఉత్సవాలు నిర్వహించబడతాయి. డాకోర్‌లో కార్తీక, ఫాల్గుణ, చైత్ర మరియు అశ్విని పౌర్ణమి రోజుల్లో జరిగే ప్రధాన ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. నూతన సంవత్సర దినం నాడు అనగా కార్తీక మాసం మొదటిరోజున అన్నకూట్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో శ్రీ రంఛోడ్‌జీకి భారీ ఎత్తున మిఠాయిలు మరియు ఆహార పదార్దాలను నైవేద్యంగా సమర్పించుకుంటారు.

ఇతర వైష్ణవ ఉత్సవాలైన హోలీ, అమలక ఏకాదశి, జన్మాష్టమి, నంద్ మహోత్సవం, రథయాత్ర మరియు దసరా పండుగలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని ఏనుగుపై ఉంచి ఊరేగిస్తారు. ఆ సమయంలో భక్తులు పాటలతో, భజనలతో భక్తిసంద్రంలో ఓలలాడుతుంటారు. డాకోర్‌లోని రంఛోడ్‌జీ దేవాలయ సందర్శించి చేసుకునే గోపాలుని దర్శనం హిందువులు ప్రధానంగా భావించే నాలుగు పుణ్యక్షేత్రా
WD PhotoWD
సందర్శనతో వచ్చే పుణ్యంతో సమానమని చెప్పబడింది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డాకోర్ చేరుకోవడమెలా :
విమాన మార్గం :
సమీపంలో గల అహ్మదాబాద్‌లో విమానాశ్రయం కలదు (95 కి.మీ).

రైలు మార్గం :
డాకోర్ ఆనంద్ గోద్రా బ్రాడ్‌గేజ్ రైలు మార్గంలో ఉన్నది.

రోడ్డు మార్గం :
అహ్మదాబాద్ మరియు వడోదరా నుంచి రాష్ట్రరోడ్డురవాణా సంస్థ బస్సులు మరియు ప్రైవేట్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu