Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోరిన కోర్కెలు తీర్చే ఖజరానా గణేషుడు

Advertiesment
సెప్టంబర్ 15వ తేదీ నుంచి మనం 'గణేషేత్సవాన్ని' జరుపుకుంటున్నాము... యావత్ భారతదేశం ఈ పండుగను ఆనందోత్సాహాల
WD PhotoWD
గణపతి స్తోత్ర
ఓం గం గణపతయే నమో నమ
సిద్ధి వినాయక నమో నమః
అష్ట వినాయక నమో నమః
గణపతి బప్పా మోరియా...

సెప్టంబర్ 15వ తేదీ నుంచి మనం 'గణేషేత్సవాన్ని' జరుపుకుంటున్నాము... యావత్ భారతదేశం ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నది... విఘ్నేశ్వరుని జన్మదినాన్ని పురస్కరించుకుని 'ఖజరానా దేవాలయం' (ఇండోర్)ను మీకు పరిచయం చేసే దిశగా మీ ముందు ఉంచుతున్నాము. ఈ దేవాలయానికున్న పవిత్రత అత్యంత ప్రతిష్ఠను పొందినది. 1735 ఏ.డీ.లో ఈ దేవాలయం నిర్మితమైంది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మంగళ్ నాథ్ అనే పూజారి స్వప్నంలో కనపడిన గణనాథుడు తనను వెలుపలకు తీయవలసిందిగా కోరినట్లు చెప్పబడింది. తన స్వప్నాన్ని గురించి మంగళ్ నాధ్ రాణి అహిల్య సభకు విన్నవించుకున్నాడు. పూజారి స్వప్నాన్ని అనుసరించి పేర్కొన్న స్థలం (బావి) నుంచి వెలికితీయవలసిందిగా దేవీ అహిల్య ఆజ్ఞాపించారు. తవ్వకాలలో బయల్పడిన గణేషుని ప్రతిమ తదనంతరకాలంలో దేవాలయంలో ప్రతిష్ఠించబడింది.

WD PhotoWD
గణేషుని ప్రతిమతో దేవాలయానికి ఎనలేని ఖ్యాతి లభించింది. గణాధిపతి దీవెనలు పొందిన ఈ దేవాలయాన్ని సందర్శించే ప్రతి భక్తుని కోరికలు తీరుతాయని ఒక విశ్వాసం. అచంచల భక్తివిశ్వాసాలతో కోరికను తీర్చుకోవాలనే సంకల్పంతో ఎవరైనా భక్తుడు దేవాలయంలో దారాన్ని కట్టినట్లయితే, అప్పుడు అతని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కోరికలు తీరిన అనంతరం అతడు ఏదేనీ దారం యొక్క ముడిని విప్పుతాడు.

అత్యంత గొప్పదైన మరియు అందమైన పరిసరాలను కలిగిన దేవాలయ ప్రాంగణంలో గణపతి యొక్క ప్రధాన దేవాలయంతోపాటుగా ఇతర దేవతలకు చెందిన 33 దేవాలయాలు కొలువై ఉన్నాయి.ప్రధాన దేవాలయంలో విఘ్నేశ్వరుని ప్రతిమతో, మహాశివుడు, దుర్గాదేవి ప్రతిమలు ఉంటాయి. భక్తుల కోరికలను తీర్చే రావిచెట్ట
WD PhotoWD
దేవాలయ ఆవరణలో ఉంది. భక్తులు ఈ చెట్టుకు 'పరిక్రమ' చేస్తారు. వేల సంఖ్యలో చిలుకలకు ఆశ్రయమిచ్చిన రావిచెట్టు దేవాలయ పరిసరాలకు సరికొత్త సౌందర్యాన్ని తీసుకువస్తున్నది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ దేవాలయ విశిష్టతను ఇనుమడింపచేసే అంశం మతసమైక్యతా భావన...అనేక మతాలకు చెందిన ప్రజల తమ కోరికలను తీర్చుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. చాలా మంది ప్రజలు తమ కొత్త వాహనాలతో ఇక్కడకు వస్తారు ... ఇక్కడి విఘ్నేశ్వరుని ఉత్సవం ఆనందోత్సాహాల మధ్య జరుగుతుంది. ప్రతి బుధవారం, ఒక సంత ఇక్కడ నిర్వహించబడుతుంది. గణేషోత్సవాలలో 11 లక్షలు 'మోదకాలు' నివేదించబడతాయి.

WD PhotoWD
దేవాలయం పూర్తి స్థాయిలో రూపొందే వరకు పూజారి మహేష్ భట్ వారసులు దేవాలయ నిర్వాహణ బాధ్యతలను చేపట్టేవారు... కానీ కొద్ది సంవత్సరాల క్రితం దేవాలయ నిర్వహణ జిల్లా పాలనాయంత్రాంగం చేతులలోకి వెళ్ళింది. ప్రస్తుతం జిల్లా మేజిస్ట్రేట్ రూపొందించిన కమిటీ దేవాలయ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నది. భట్ కుటుంబం సైతం దేవాలయ నిర్వహణలో పాలు పంచుకుంటున్నది. ప్రస్తుతం. దేవాలయాన్ని భాల్ చంద్ర భట్ నిర్వహిస్తున్నారు. దేవాలయ పునరుద్ధరణ కోసం ఆయన అనేక సంవత్సరాలు ఉపవాసం ఉన్నారు. ప్రస్తుతం, ప్రత్యేక సందర్భాలలో ఆయన గణేశుని ప్రధాన ప్రార్ధన చేస్తున్నాడు.

ఏ సమయంలో అక్కడుకు వెళ్ళవచ్చు? భక్తుల కోసం దేవాలయ తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయి. ప్రతి బుధవారం ఇక్కడ జరిగే సంతను మీరు చూడవచ్చు కానీ దేవాలయం యొక్క ప్రత్యేక ఉత్సవాలను మీరు చూడాలనుకున్నట్లయితే, గణేష్ చతుర్థి రోజు మీరు అక్కడకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఆరోజు, ప్రత్యేక 'నైవేద్యం' గణేశునికి నివేదించబడుతుంది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేరుకోవడమెలా? మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధానిగా ఇండోర్ ప్రస్తావించబడింది. మూడవ జాతీయ రహదారి అయిన ఆగ్రా-ముంబై రోఢ్డుకు ఇండోర్ కలుపబడి ఉంది. ఏదో విధమైన మార్గం ద్వారా మీరు ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu