Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉజ్జయినిలో వెలిసిన కాళికామాత

ఉజ్జయినిలో వెలిసిన కాళికామాత
ఈ వారం తీర్థయాత్ర ఎపిసోడ్‌లో మిమ్మల్ని ఉజ్జయినిలో కాళీఘాట్ వద్ద వెలసిన కాళికామాత ఆలయానికి తీసుకెళుతున్నాం. ఈ ఆలయాన్ని గర్ కాళికా అని కూడా పిలుస్తుంటారు. దేవీ మాతలందరిలో కాళికామాతకు ఎనలేని ప్రాధాన్యముంది.

ప్రాచీన భారతీయ కవులలో అగ్రగణ్యుడైన కాళిదాసు సైతం కాళికా దేవి భక్తుడని చెబుతుంటారు. పురాణాల ప్రకారం కాళిదాసు నిత్యం కాళీమాతను పూజించేవాడు. గర్ కాళిక ఆశీర్వాదం వల్లే అతడికి అపూర్వమైన కవితాశక్తి అబ్బింది. కాళికా మాతను పూజించడానికి శ్యామలా దండకం పేరట జగత్ప్రసిద్ధమైన స్తోత్రాన్ని కాళిదాసు రచించాడు. ఉజ్జయినిలో ప్రతి ఏటా నిర్వహించే కాళిదాస్ సమరోహ్ కార్యక్రమంలో ఈ దండకాన్ని పఠిస్తుంటారు.
WD

ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ఈ గర్ కాళిక ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం ఎవరికీ తెలీదు కానీ దీనిని మహాభారత కాలంలో నిర్మించారని ప్రజల నమ్మకం. అయితే మహాభారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ కాళికామాత విగ్రహం మాత్రం సత్యయుగానికి చెందినదని చెబుతుంటారు. హర్షవర్ధన రాజు హయాంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. తర్వాత చాలా కాలానికి గ్వాలియర్ రాజు ఈ ఆలయానికి తిరిగి మరమ్మతులు చేయించారు.

webdunia
WD
సంవత్సరం పొడవునా ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి కాని, నవరాత్రులలో మాత్రం భారీస్థాయిలో ఉత్సవాలు నిర్వహించబడతాయి. మతపరమైన యజ్ఞాలు, పూజలు కూడా నవరాత్రుల సమయంలో ఇక్కడ భారీ స్థాయిలో నిర్వహించబడతాయి.

గమ్య మార్గ
ఇండోర్ విమానాశ్రయం నుంచి ఉజ్జయిని 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఉజ్జయినికి రైలు మార్గం చాలా చక్కగా ఉంటోంది. పశ్చిమ రైల్వే స్టేషన్‌లో ఉజ్జయిని ఒక ముఖ్యమైన స్టేషన్
బస్సు మార్గంలో ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో, భోపాల్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉజ్జయినిని చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu