Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వపాపహరణం... కాశీ సందర్శనం

Advertiesment
సర్వపాపహరణం... కాశీ సందర్శనం

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

భారతదేశపు అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి ప్రపంచంలోనే అతిపురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. వారణాసి నగరం నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కాశీ విశ్వేశ్వర దేవాలయం సంప్రాప్తించుకుంది.

స్త్రీ పురుషులు, పిల్లలు వృద్ధులు అనే తారతమ్యాలుకు చోటు లేకుండా, కులమతాలకు అతీతంగా ఎవరైనా కావచ్చు వారాణాశిని సందర్శించి గంగా నదిలో స్నానం చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారని హిందూ పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. కనుకనే జీవితకాలంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ.

ధార్మిక ప్రాధాన్యత
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీపై పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రమైన కాశీ పేరుగాంచింది. పురాణాలను అనుసరించి అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని దశాశ్వమేథ ఘాట్‌కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు బోళాశంకరునికి స్వాగతం పలికాడు.

WD PhotoWD
కాశీ దేవాలయం
గంగానదికి సమీపంలో విశ్వనాథ గల్లీగా పిలవబడే చిన్న వీధిలో చిన్న చిన్న దేవాలయాల సమూహంగా దేవాలయ ప్రాంగణం వర్థిల్లుతోంది. ప్రాంగణంలోని విశ్వనాథ దేవాలయం చుట్టు పక్కల అనేక అనుబంధితమైన పీఠాలు ఆవరించి ఉన్నాయి. 'జ్ఞాన వాపి' అనగా జ్ఞాన బావిగా పేరొందిన నుయ్యి ఒకటి ప్రధాన దేవాలయానికి ఉత్తర దిశలో నెలకొంది.

విశ్వనాథ దేవాలయం మంటపం మరియు గర్భగుడితో అలరారుతోంది. గర్భగుడిలో ప్రధానంగా పూజలందుకునే శివస్వరూపానికి తార్కాణంగా నిలుస్తున్న లింగం 60 సెం.మీ.ల పొడవు మరియు 90 సెం.మీ.ల చుట్టుకొలతతో వెండి తాపడాన్ని కలిగి ఉంటుంది. శివలింగం నల్లరాతితో నిర్మితమైంది. దేవాలయ అంతర్భాగం విశాలంగా లేకున్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి మహాశివుని పూజించుకునేందుకు భక్తులకు అనువుగా ఉంటోంది.

చరిత్ర
చరిత్ర పుట్టకముందు కాలం నుంచి దేవాలయం ఉన్నట్లుగా చెప్పబడింది. దేవాలయం ప్రాంగణంలోని భవన సముదాయాన్ని పునరుద్ధరించే నిమిత్తం 1776 సంవత్సరంలో అప్పటి ఇండోర్ సంస్థానపు మహారాణి అహల్యాబాయి భారీగా విరాళాలను అందించారు. దేవాలయ ఊర్థ్వభాగంలో 16 మీటర్ల ఎత్తైన కలశ గోపురాన్ని నిర్మించేందుకు లాహోర్ మహారాజు రంజిత్ సింగ్ 1000 కేజీల స్వర్ణాన్ని విరాళంగా ఇచ్చారని చెప్పబడింది. 1983 సంవత్సరంలో దేవాలయ నిర్వహణ బాధ్యతలను
webdunia
WD PhotoWD
చేపట్టిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బెనారస్ పూర్వ పాలకుడు విభూతి సింగ్‌ను దేవాలయ ధర్మకర్తగా నియమించింది.

పూజకు వేళాయెనే...
ప్రతి రోజు తెల్లవారుఝామున గం 02.30 ని.లకు దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో జరిగే మంగళహారతికి టిక్కెట్లు కలిగిన భక్తులను అనుమతిస్తారు. అనంతరం ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాధారణ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మధ్యాహ్న భోగ్ హారతిని ఇస్తారు. మరల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు భక్తులు ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు.

webdunia
WD PhotoWD
సాయంత్రం ఏడు నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాయంకాలపు సప్త రుషి హారతిని ఇస్తారు. తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. వెంటనే శృంగార్ లేదా భోగ్ హారతి ప్రారంభమవుతుంది. తొమ్మిది గంటల తర్వాత వెలుపలి నుంచి దర్శనం చేసుకునే అవకాశం మాత్రమే భక్తులకు లభిస్తుంది. రాత్రి గం. 10.30 ని.లకు శయన హారతి ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు దేవాలయ ద్వారాలను మూసివేస్తారు. ప్రసాదంలో అత్యధికంగా చోటు చేసుకునే పాలు, వస్త్రాలు మరియు ఇతర నైవేద్యాలు పేదవారికి అందిస్తారు.

చేరుకునే మార్గం
విమానం ద్వారా...
దేశంలోని ప్రధాన నగరాలు, పర్యాటక ప్రాంతాలకు వారణాసి చక్కగా అనుసంధానమైంది. వారాణాసి నుంచి దేశంలోని అనేక నగరాలకు ప్రతి రోజు దేశీయ విమాన సేవలు లభిస్తున్నాయి. ఢిల్లీ-ఆగ్రా-ఖజరహో-వారణాసి రోజువారీ విమాన సేవలు పర్యాటకులలో బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి.

రైలు ద్వారా...
ఉత్తర భారత భూభాగంలోని కీలక ప్రాంతంలో వారణాసి కొలువై ఉండటంతో ఈ నగరం ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు దేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కగా
webdunia
WD PhotoWD
అనుసంధానమైంది. కాశీ జంక్షన్, వారాణాసి జంక్షన్ (వారణాసి కంటోన్మెంట్‌గా ప్రసిద్ధి) పేరిట రెండు రైల్వే స్టేషన్లు వారణాసిలో ఉన్నాయి. అంతేకాక ఢిల్లీ లేదా కోల్‌కతా నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి మీదుగా ప్రయాణిస్తుంటుంది.

రోడ్డు ద్వారా...
సమతలమైన గంగా పీఠభూమి ప్రాంతాల్లో నెలకొనడంతో వారాణాసికి మంచి రహదారుల నెట్‌వర్క్ కలదు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడకు తరుచుగా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ప్రజలను చేరవేస్తుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu