Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ వారసత్వ సంపదగా బామ్ జీసస్ చర్చి

ప్రపంచ వారసత్వ సంపదగా బామ్ జీసస్ చర్చి
, ఆదివారం, 28 సెప్టెంబరు 2008 (16:06 IST)
WD
తీర్థయాత్ర ఎపిసోడ్‌లో భాగంగా ఈ సారి మిమ్ములను గోవాలోని సుప్రసిద్ధ చర్చ్ బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చికి తీసుకెళుతున్నాం. ఈ చర్చి పాత గోవాలో నెలకొని ఉంది. గోవా రాజధాని పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఈ చర్చి ఉంది. గోవాలో సుప్రసిద్ధ క్రైస్తవ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధికి, పవిత్ర చిహ్నాలకు నెలవుగా ఉన్న బామ్ జీసస్ చర్చి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఈ చర్చిని ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు.

బామ్ జీసస్ అంటే మంచి లేదా బాల ఏసు అని అర్థం. ఈ చర్చి నిర్మాణం 1594లో ప్రారంభమై 1605లో ముగిసింది. మూడు అంతస్తుల వరుసలతో కూడిన ఈ చర్చి ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు చిన్న ప్రవేశ ద్వారాలు ఉంటాయి. గ్రీకు భాషలో జీసస్ పేరులోని తొలి మూడు అక్షరాలను ప్రతిబింబించే ఐహెచ్ఎస్ నాణేన్ని ఈ చర్చి పైభాగాన చొప్పించారు.
webdunia
WD

చర్చిలోకి అడుగు పెట్టగానే కుడివైపున సెయింట్ ఆంథోని పూజా పీఠం కనిపిస్తుంది. ఎడమవైపున సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కొయ్య విగ్రహం అమర్చారు. ప్రధాన పూజాపీఠం ఇరువైపుల అవర్ లేడీ ఆఫ్ హోప్ మరియు సెయింట్ మైఖేల్ పూజా పీఠాలను అమర్చారు. వైభవంగా తీర్చిదిద్దిన ప్రధాన పూజాపీఠంలో బాల ఏసు ఉండగా పై భాగాన భారీ ఆకారంలోని సెయింట్ ఇగ్నాసియస్ లయోలా విగ్రహం, ఐహెచ్ఎస్ అక్షరాలను పొందుపర్చిన నాణేన్ని ఉంచారు.

ఈ నాణెం పైభాగాన పవిత్ర త్రిముఖ పీఠాన్ని -హోలీ ట్రినిటి (తండ్రి, కుమారుడు పవిత్రాత్మ) అమర్చారు. ఎడమచేతి వైపున పూజాపీఠంలో దేవుడి ఆశీర్వాదం పొందిన మతపూజా కార్యక్రమాన్ని ఉంచారు. కుడివైపున మాత్రం సెయింట్ జేవియర్ పార్థివకాయానికి చెందిన పవిత్ర చిహ్నాలు అమర్చారు. సమాధి పైన వెండి పేటికలో ఈ పవిత్ర చిహ్నాలను ఉంచారు. ఈ పేటిక లోపలి వైపున సెయింట్ జీవిత చరిత్రకు సంబంధించిన దృశ్యాలను చిత్రించారు.

సముద్ర మార్గంలో చైనా ప్రయాణిస్తున్న సందర్భంగా 1552 డిసెంబర్ 2న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మరణించారు. తర్వాత ఆయన కోరిక ప్రకారం పార్థివకాయాన్ని గోవాకు తరలించారు. ఆయన దేహాన్ని సమాధి చేసిన రోజున ఉన్న తాజాదనం ఈ నాటికీ చెక్కుచెదరకపోవడం గమనార్హం. ఈ అద్భుత దృశ్యం ఈ నాటికీ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి బహిరంగ ప్రదర్శనలో ఉంచే ఆయన దేహం లక్షలాది భక్తులను ఆకర్షిస్తూ ఉంది.
webdunia
WD


చర్చిలో ప్రతి మూడేళ్లకోసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విందును జరుపుకుంటారు. గోవాలో అత్యంత ప్రసిద్ధి పొందిన క్రిస్టియన్ పండుగలలో ఒకటైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విందు ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాక భక్తులను గోవాకు రప్పిస్తుంది. ఈ సందర్భంగా చర్చిలో ఉదయం పూట చేసే ప్రార్థనలో పాల్గొనేందుకు నలుమూలలనుంచి భక్త జనం గోవాకు తరలి వస్తారు.

webdunia
WD
ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: గోవా రాజధాని పనాజీకి ఉండే రోడ్డు మార్గం ద్వారా ఈ చర్చికి చేరుకోవచ్చు. పాత గోవాకు పది కిలోమీటర్ల దూరంలో పనాజీ ఉంది. ఇక్కడి నుంచి పాత గోవాకు వెళ్లడానికి బస్సులు, టాక్సీలు, ఆటో రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం: కొంకణ్ రైల్వేస్ ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు ఈ పట్టణం అనుసంధానమై ఉంది. మార్గోవా మరియు వాస్కోడిగామా అనేవి గోవాలోని రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు.

విమాన మార్గం: డబోలిమ్ ఎయిర్‌పోర్ట్ గోవాలోని ఏకైక విమానాశ్రయం. ఇది వాస్కొడిగామాలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu