Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగచంద్రేశ్వర ఆలయ దర్శనం.. సర్వ సర్ప దోష నివారణం

Advertiesment
మహాకాళ దేవుని మహా నగరం.. ఉజ్జయిని. ఈ నగరానికి దేవాలయాల నగరంగా మరో పేరుంది.
WD PhotoWD
మహాకాళ దేవుని మహా నగరం.. ఉజ్జయిని. ఈ నగరానికి దేవాలయాల నగరంగా మరో పేరుంది. ఈ నగరంలో వీధికి ఒక దేవాలయాన్ని మీరు కనుగొనవచ్చు. కానీ నాగచంద్రేశ్వర దేవాలయానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉన్నది. మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్ర భాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒకసారి అదీ 'నాగపంచమి' నాడు తెరవబడుతుంది.

సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు. నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా గణాంకాలను అనుసరించి నాగపంచమి నాడు 24 గంటల వ్యవధిలో రమారమిగా లక్ష నుంచి రెండు లక్షల మంది దాకా భక్తులు ఇక్కడ దైవదర్శన
WD PhotoWD
చేసుకుంటారు. దేవాలయం లోపలిభాగంలో, విఘ్నేశ్నర పార్వతీ సమేత ఈశ్వరుని భారీ విగ్రహం కొలువై ఉంటుంది. పరమశివుని విగ్రహం సర్పతల్పంపై ప్రతిష్టించబడి ఉంటుంది.

సాధారణంగా మహావిష్ణువు సర్పతల్పంపై పరుండి కనిపిస్తాడు కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని రీతిలో ఇక్కడి దేవాలయంలో బోళాశంకరుడు సర్పతల్పంపై పవ్వళించి ఉంటాడు. విగ్రహ రూపంలోని శంకర మహాదేవుడు భుజంపైన మరియు మెడ చుట్టూ సర్పాలను ధరించి ఉంటాడు.

'
WD PhotoWD
సర్పాధిపతి తక్షకుడు పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేసాడు. తక్షకుని తపస్సుకు సంతసించిన మహాశివుడు చిరంజీవిగా వర్ధిల్లమని వరమిచ్చాడు. ఆనాటి నుంచి తక్షకుడు మహాశివుని చెంతనే ఉండిపోయాడని చెప్పబడింది.'

ఇతిహాసాల విశ్వాసం
ఇది చాలా పురాతనమైన దేవాలయం. పర్మర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1050వ సంవత్సరంలో పునరుద్ధరించాడని ఒక విశ్వాసం. అనంతరం 1732వ సంవత్సరంలో, మహాకాళ దేవాలయంతో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూత్న వైభవాన్ని తెచ్చారు.

ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని చెప్పబడింది. 'నాగపంచమి' నాడు లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయాన్ని
WD PhotoWD
సందర్శించడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక్కడకు వచ్చిన ప్రతిఒక్కరూ మహాశివుని దర్శించాలని కోరుకుంటారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎప్పుడు వెళ్ళాలి
మీరు ఈ దేవాలయాన్ని సందర్శించదలచినట్లయితే, నాగపంచమి నాడు మాత్రమే తెరిచి ఉండే దేవాలయానికి ఆనాడే వెళ్ళండి. మీరు ఉజ్జయినీని సందర్శిచదలచినట్లయితే, నాగపంచమి పండుగకు సమీప కాలాన్ని ఎంచుకోవడం ద్వారా సర్పాధిపతి తక్షకుని కూడా మీరు సేవించవచ్చు.

WD PhotoWD
ఎలా వెళ్ళాలి?

రోడ్డు మార్గం...
ఇండోర్ (55 కి.మీ.), భోపాల్ (200 కి.మీ.) మరియు ఖాండ్వా (175 కి.మీ.) లకు ఉజ్జయినీ నుంచి ఇరువైపులా రవాణా సౌకర్యం కలదు. ఈ నగరాల నుంచి బస్సులు మరియు ట్యాక్సీలను సులభంగా కనుగొనవచ్చు.

రైలు మార్గం...
ఉజ్జయినీకి రైలు మార్గం కలదు. ముంబాయి, ఢిల్లీ, భోపాల్, ఖాండ్వా మరియు ఇండోర్ నగరాల నుంచి ఇక్కడకు నేరుగా చేర్చే రైలు సౌకర్యం ఉంది.

విమాన మార్గం...
ఇండోర్‌లోని దేవీ అహల్యా విమానాశ్రయం (65 కి.మీ.) ఇక్కడకు సమీపంలో ఉంది.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎక్కడ బస చేయాలి?
మీ అవసరాలు మరియు ఆర్థిక స్తోమతను అనుసరించి ఉజ్జయినీలో 'ధర్మశాల' మరియు హోటళ్లు ఉన్నాయి. అంతేకాక మహాకాళ కమీటి మరియు హర్‌సిద్ధి కమిటీకి చెందిన ధర్మశాలలు అందుబాటులో ధరలకు ఇక్కడ లభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu