Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవ దంపతులు సందర్శించే మునుదేవి ఆలయం

నవ దంపతులు సందర్శించే మునుదేవి ఆలయం
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా శ్రీ క్షేత్ర మునుదేవి ఆలయ చరిత్రను మీకు పరిచయం చేస్తున్నాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వేరు చేసే అందమైన సత్పురా పర్వతశ్రేణుల మధ్య ఈ ఆలయం కొలువైవుంది. మునుదేవి ఆలయంలో ఖందేష్ దేవిమాత కొలుదీరి, భక్తుల మొక్కులు తీర్చుతోంది.

ఈ పురాతన ఆలయం మహారాష్ట్రకు ఈశాన్య దిక్కుగా ఉండే యావల్-ఛోప్రా జాతీయ రహదారి కాసరఖేడ్-అడగాన్ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చుట్టూత కనువిందు చేసేలా తివాచీ పరిచినట్టుగా కనిపించే పచ్చటి పర్వతశ్రేణులు ఆలయానికి మరింత శోభను కనిపిస్తున్నాయి. ఆలయానికి సమీపంలోని గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి ఖందేష్ మాతను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని వెళుతుంటారు.

సాత్పురా పర్వతశ్రేణుల్లోని గ్వాలివదా ప్రాంతానికి క్రీస్తుపూర్వం 1200 కాలంలోఈశ్వర్‌సేన్ అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయకు అపార పశుసంపద ఉండేది. కొన్ని గోవులు రోజు ప్రస్తుత మహారాష్ట్రలోని తపతి నదికి నీరు త్రాగడానికి వెళ్లేవి. మిగిలిన గోవులు మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదికి వెళ్లేవి. అయితే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో మాన్‌మోది అనే భయానక వ్యాధి వ్యాపించసాగింది. ఖాందేశ్ ప్రాంతమంతా ఈ వ్యాధి వ్యాపించింది. దీంతో ఖాందేశ్‌తో పాటు, సాత్పుర పర్వతశ్రేణుల్లో భారీగా పశు ప్రాణనష్టం సంభవించింది.

ఈ భయానక వ్యాధి నుంచి రాజ్యాన్ని రక్షించేందుకు క్రీస్తుపూర్వ 1250 కాలంలో రాజు ఈశ్వర్‌సేన్ గ్వాలివదా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో "మనుదేవి" మాత ఆలయాన్ని నిర్మించారు. అనంతరం గ్వాలివదాకు, ఆలయానికి మధ్యలో ఆయన 13 అడుగుల వెడల్పుతో గోడను నిర్మించారు.

FileFILE
గ్వాలివదాకు మాన్‌మోది వ్యాధి నుంచి, భూతప్రేతాల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ఏర్పాటు చేశారు. మనుదేవి మాత ప్రస్తావనను మనం భగవద్గీతలోనూ చూడవచ్చు. మధుర వెళ్లే ఘట్టంలో సాత్పురా పర్వతశ్రేణుల్లో మనుదేవి మాత ఉంటారని శ్రీకృష్ణుడు చెప్పినట్టు ప్రస్తావన ఉంది.

ఈ పురాతన ఆలయంలో ఏడు నుంచి ఎనిమిది బావులు ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించే సమయంలో మనుదేవి, గణేష్, శివలింగం, అన్నపూర్ణ మాత విగ్రహాలు బల్పడ్డాయి. ఆలయం చుట్టూత, ముందుభాగంలోనూ ప్రకృతిశోభాయమానమైన కొండలు ఉన్నాయి. అంతేకాకుండా అదమైన వాటర్‌ఫాల్‌ 'కావ్‌తాల్‌' ఉంది.

ఈ ఆలయానికి భక్తులు ఏడాదిలో నాలుగు సార్లు వస్తుంటారు. నవరాత్రి సమయాల్లో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. మనుదేవి కృపా కటాక్షాల కోసం దేశం
webdunia
FileFILE
నలుమూలల భక్తులు ఇక్కడకు వచ్చి, తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో నూతన దంపతులు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉంది.

తమ సంసార జీవితం సాఫీగా సాగాలని కొత్త దంపతులు పూజలు చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం, సత్పురా మనుదేవి ఆలయ ట్రస్టు సంయుక్తంగా ఆలయం వరకు రోడ్డు వేశాయి. ఈ రోడ్డు వేయక ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు ఆలయానికి కాలిబాటన వచ్చేవారు.

ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం ద్వారా.. భుసావల్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో యావల్ ఉంది. అక్కడ నుంచి బస్సులో మునువాడి ఆలయానికి చేరుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా.. దేశంలోని ప్రధాన ప్రాంతాల నుంచి భుసావల్‌కు రైలు సౌకర్యం ఉంది.
విమానమార్గం.. ఔరంగాబాద్ విమానాశ్రయం 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu