Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళనాథుని దర్శనం.. దోష నివారణం

Advertiesment
మంగళనాథుని దర్శనం.. దోష నివారణం
WD PhotoWD
మా తీర్థయాత్రలో ఈసారి మంగళనాథ (కుజుడు) స్వామివారి ఆలయాన్ని దర్శించి, దాని ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ అధ్యాత్మికత ప్రాంతాల్లో ఒకటైన ఉజ్జెయిని నగరంలో ఈ దేవాలయం కొలువై ఉన్నది. పురాణ గాధ ప్రకారం, ఉజ్జెయిని నగరం కుజుని తల్లి. జాతకపత్రంలో ఎవరైతే కుజుని కలిగి ఉంటారో వారు చాలా శక్తివంతులుగా ఉంటారు. అంతేకాదు.. తమకు అనుకూలించని గ్రహాలను మేలు చేయాల్సిందిగా కోరుకునేందుకు భక్తులు మంగళనాథుని సందర్శిస్తారు.

అయితే మన దేశంలో మంగళనాథుడు కొలువై ఉన్న ఆలయాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఉజ్జెయిని కుజుడు పుట్టిన ప్రదేశం కావటంతో ఈ ప్రదేశానికి అత్యంప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ దేవాలయం కొన్ని శతాబ్దాలనాటిది. సింధియా రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఉజ్జెయిని నగరానకి మహాకాళ్ నగరంగా మరో పేరు కూడా ఉంది. దీనితో మంగళనాథ స్వామి శివుని ఆకారంలో పూజలందుకుంటున్నాడు.
webdunia
WD PhotoWD
ఇక్కడకు ప్రతి మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు వేంచేస్తూ, తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. కుజ గ్రహం పుట్టుక ఈ క్రింది విధంగా ఉన్నది.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తన రక్తం నుంచి వందల కొద్దీ రాక్షసులు జన్మిస్తారన్న వరాన్ని అంధకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని నుంచి పొందుతాడు. ఇక అప్పటి నుంచి ఆ రాక్షసుడు అవంతికపై విరుచుకపడ్డాడు. దీనితో బాధితులందరూ పరమేశ్వరుని శరణుజొచ్చారు. భక్తజన కోటి రక్షణకు శివశంకరుడు అంధకాసురునిపై విరుచుకుపడ్డాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శివునికి ముచ్చెమటలు పోయడం ఆరంభమవుతుంది. రుద్రుని చమట బిందువు వేడికి, ఉజ్జెయిని రెండు భాగాలుగా విడిపోయి కుజగ్రహం ఆవిర్భవించింది. అంధకాసురుని పరమేశ్వరుడు వధించాడు.

webdunia
WD PhotoWD
అతని నుంచి వెలువడిన రక్తపు బొట్టులను కుజ గ్రహం సంగ్రహించడం జరిగింది. ఈ కారణం చేతనే కుజగ్రహం ఉపరితలం ఎరుపు రంగులో ఉంటుందని స్కంధ పురాణంలోని అవంతిక ఖండ్ ప్రకారం పేర్కొంటుంటారు. ఈ దేవాలయంలో మంగళ హారతి ఉదయం ఆరుగంటలకు ప్రారంభమవుతుంది. ఈ తంతు జరిగిన మరుక్షణం దేవాలయం ఆవరణలో ఆరతి చిలుకలు తిరుగాడతాయి. స్వామివారి ప్రసాదాన్ని ఆరగించేవరకు అవి అక్కడ నుంచి కదలవు. ఒకవేళ ప్రసాదం పెట్టటం ఆలస్యమయితే ఆ చిలుకలు అదేపనిగా అరుస్తుంటాయని దేవాలయ పూజారి నిరంజన్ భారతి చెప్పారు.

మంగళనాథుడే ఆ పక్షుల రూపంలో వేంచేసి ప్రసాదాన్ని ఆరగిస్తాయన్నది ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం. ఇతమిత్థంగా మంగళనాథుడు మేషం మరియు వృశ్చిక రాశులకు అధిపతిగా పిలుస్తారు. ఎవరైతే తమ జాతకచక్రంలో కుజుని నాలుగు, ఏడవ, ఎనిమిదవ మరియు 12వ స్థానాలలో కలిగి ఉంటారో వారు కుజుని శాంతింపజేయటం కోసం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. మార్చిలో వచ్చే అంగారక చతుర్థి రోజున మంగళనాథునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈ రోజున నిర్వహించబడతాయి. ఉజ్జయినికి సుదూర ప్రాంతంలో ఉన్నవారు సైతం మంగళనాథుని శాంతి కోసం ప్రత్యేక పూజల
webdunia
WD PhotoWD
నిర్వహిస్తారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంగళనాథుని ఆలయాన్ని సందర్శించినంత మాత్రానికే, కోపంగా ఉన్న మంగళనాథుడు శాంతిస్తాడని ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసంతోనే కుజదోష నివృత్తి కోసం వేలకొలది నూతన వధూవరులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి మంగళవారం మంగళనాధుని దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక మార్చిలో వచ్చే అంగారక చతుర్థినాడైతే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఆలయ ప్రాంగణం క్కిక్కిరిసి పోతుంది. అయితే మీ వీలునుబట్టి ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రతిమంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.

webdunia
WD PhotoWD
ఎలా వెళ్లాలి?

రైలు మార్గం ద్వారా..
ముంబై, ఢిల్లీ, ఇండోర్, భోపాల్ మరియు ఖాండ్వాల నుంచి నేరుగా ఇక్కడకు రైళ్లు ఉన్నాయి.

విమాన ప్రయాణం - ఇండోర్ ఈ ఆలయానికి అతి సమీపంలో ఉన్న విమానాశ్రయం ఉంది. ఈ ప్రాంతాల మధ్య దూరం 65 కి.మీ.

ఎక్కడ బస చేయాలి?
బస చేయటానికి ఉజ్జయిని నగరంలో పేరొందిన హోటళ్లు మరియు ధర్మశాలలు ఉన్నాయి. మహాకాళ్ మరియు హరిసిద్ధికి ఆలయాల సమీపంలో మహాకాళ
webdunia
WD PhotoWD
కమిటీకి సంబంధించిన మంచి ధర్మశాలలు ఉన్నాయి. ఈ ధర్మశాలల్లో ఏసి, నాన్-ఏసి గదులు మరియు డార్మిటరి కూడా లభ్యమవుతాయి. ఆలయ నిర్వహణ సంఘం ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఫోటో గ్యాలెరీ కోసం క్లిక్ చేయండి

Share this Story:

Follow Webdunia telugu