వేడి ఇనుప కడ్డీల( చాచవా)తో వ్యాధి నివారణ
						
		
			      
	  
	
			
			  
	  
      
									
						
			
				    		 , సోమవారం,  8 అక్టోబరు 2007 (21:47 IST)
	    	       
      
      
		
										
								
																	
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	 అత్యధిక వ్యయప్రయాసలతో 'ఏదినిజం' విభాగం ద్వారా సమాజంలో బహుముఖాలుగా వేళ్ళూనుకున్న  మూఢనమ్మకాలకు నిదర్శనమైన పలు సంఘటనలను మీ ముందు ఉంచుతున్నాము. వాటిలో కొన్ని  సంఘటనలు పలు రకాలైన రోగ చికిత్సలకు అనుబంధితమై ఉండటం గమనార్హం. వ్యాధి తాలూకు తీవ్ర ప్రభావం  నుంచి బయట పడలేని కొందరు, ఇటువంటి మూఢనమ్మకాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండిదయచేసి ఇటువంటి గారడీలు మరియు మోసాల వలలో పడవద్దని మా ప్రియమైన పాఠకులకు విజ్ఞప్తి  చేస్తున్నాము. మా కథనాల ద్వారా పాఠకులలో చైతన్యం కలిగించి వారిని మూఢనమ్మకాలకు దూరంగా ఉంచాలనే  లక్ష్యంతో మారుమూల ప్రాంతాలకు సైతం మా బృందం ప్రయాణిస్తున్నది.మా ప్రయత్నాలకు కొనసాగింపుగా, మధ్యప్రదేశ్‌లోని అనేక గ్రామాలకు విస్తరించిన ఒక మూఢనమ్మకాన్ని మీకు  పరిచయం చేస్తున్నాము. భయానకమైన ఈ చికిత్సా ప్రక్రియను 'చాచవా'గా పిలుస్తారు. ఈ ప్రక్రియలో, వేడి ఇనుప  కడ్డీలను రోగి దేహంపై ఉంచుతారు.మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలైన విదిష, ఖండవ, బాయిటూల్, ధార్, గ్వాలియర్, భీండ్-మురియన  ప్రాంతాలలో ఈ వైవిధ్యమైన వైద్య ప్రక్రియ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ ప్రక్రియ ద్వారా చికిత్స చేసే వ్యక్తిని  గ్రామీణులు 'బాబా' అని పిలుస్తారు.
									
										
								 
			
							 
										
								
																	
									
											
									
			        							
								
																	
									
					
			        							
								
																	
									
										
								 
			
							 
										
								
																	
									
					
			        							
								
																	 ఈ చికిత్సను గురించిన సమాచారం తెలుసుకోగానే, మోఖా పిప్లియా గ్రామానికి చెందిన అటువంటి 'బాబా'ను  మేము కలుసుకున్నాము. అతనే అంబారామ్ జీ. గత 20 సంవత్సరాలుగా తాను ఈ విధమైన చికిత్సను  అందిస్తున్నట్లు అతడు చెప్పుకున్నాడు. అతని తండ్రి కూడా ఇదే పద్ధతిలో రోగ నివారణ చేసేవారట. పోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.కడుపు నొప్పి, వాయురూపమైన, మూలవ్యాధి, గర్భసంచీలో భ్రూణము చెదురుట, క్షయ, పక్షవాతం మరియు  కాలేయ సంబంధిత వ్యాధులను 'చాచవా' ద్వారా నయం చేస్తానని అతడు బల్లగుద్ది మరీ చెప్తున్నాడు.  అంబారామ్‌జీ చెప్పిన దానిని అనుసరించి, మానవ దేహంలోని అన్ని రకాల వ్యాధులను 'చాచవా' భస్మం చేస్తుంది.  చికిత్స ప్రభావానికి ఆకర్షితులైన ప్రజలు ఆయనను 'డాక్టర్'గా సంబోధిస్తుంటారు. ఈ చికిత్సను పొందిన అనేక  మంది రోగుల దేహాలపై కాలిన గుర్తులు కనిపిస్తాయి. తన దేహంపై 'చాచవా' తాలూకు 11 గుర్తులను కలిగి ఉన్న చందర్ సింగ్ వారిలో ఒకరు. చందర్ చెప్పినదానిని బట్టి,  'చాచవా' తీసుకున్న వెంటనే అతనికి ఉపశమనం లభించింది. కడుపు నొప్పి, తలనొప్పి, కాలేయంలో నొప్పి నుంచి  బయటపడటానికి అతడు ఈ చికిత్సను ఆశ్రయించాడు. తన దేహంపై గల 'చాచవా' గుర్తులను అతడు మాకు  చూపించాడు.
									
										
										
								
																	
									
			                     
							
							
			        							
								
																	  పచ్చబొట్టు తరహాలో 'చాచవా' కూడా తన గుర్తులను దేహంపై శాశ్వతంగా నిలుపుతుంది. రోగి యొక్క  వ్యాధిగ్రస్థమైన అవయవాలైన మెడ, తల లేదా కడుపుపై అంబారామ్ జీ 'చాచవా' గుర్తులను వేస్తాడు. కొందరు  రోగులపై గల 'చాచవా' గుర్తులు, వారు అనేక పర్యాయాలు ఈ చికిత్సను పొందినదానికి సంకేతంగా నిలుస్తున్నాయి.చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా. అయితే ఇక్కడ క్లిక్ చేయండి 
									
			                     
							
							
			        							
								
																	
									
										
								 
			
							 
										
								
																	
									
			                     
							
							
			        							
								
																	 ప్రతి ఆదివారం, చికిత్స కోసం బారులు తీరిన ప్రజలను మీరు ఇక్కడ చూడవచ్చు. యువకులు లేదా పెద్దవారే కాక  శిశువులు సైతం తమ దేహాలపై 'చాచవా'ను పుచ్చుకుంటారు. చికిత్సా సమయంలో రోగికి ఎలాంటి నొప్పి ఉండదనే  విశ్వాసంతో పాటుగా, చికిత్స పొందేటప్పుడు పిల్లలు మరియు వృద్ధులు చేసే బాధతో కూడిన ఆర్తనాదాలు ఈ  ప్రక్రియ యొక్క వేరొక పార్శ్వాన్ని స్పృశిస్తున్నాయి.ఫోటోగ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండికానీ అంబారామ్‌జీ మరియు అతని అనుచర గణానికి దీని గురించిన బెంగ ఏ మాత్రం లేదు... చికిత్స తర్వాత రోగి  స్వస్థతను పొందుతాడనే అనే అంశాన్ని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన శిశువుకు చాచవాను  ఇప్పించాలని అక్కడకు వచ్చిన ఒక మాతృమూర్తిని మేము నిలువరించడానికి ప్రయత్నించగా, ఆమె మాపైన  కేకలు వేస్తూ, రోదిస్తూ ఇలా అంది, " వాడికి నీళ్ళవిరేచనాలు, ఇప్పుడు కనుక వాడికి 'చాచవా' ఇప్పించకపోతే వాడు  చనిపోవడం ఖాయం. ఏది మంచి ఏది చెడు అనేది మాకు తెలుసు." నిశ్చేష్టులమైన మా కనుల ఎదుటనే ఆ  మాతృమూర్తి తన చిన్నారి బిడ్డకు ఐదు సార్లు 'చాచవా' ఇప్పించింది.ఈ వ్యవహారం గురించి మేము ఒక వైద్యుని ఆరాతీయగా ఇటువంటి ప్రక్రియలన్నీ పూర్తిగా అర్థరహితమని తేల్చి  చెప్పారు. వాళ్ళు కేవలం మానసికమైన సందేహాలను నయం చేయగలరు కానీ ఎటువంటి వ్యాధిని నయం  చేయలేరు. కానీ ఈ తరహా అనారోగ్యకరమైన వ్యాధి నివారణ పద్ధతులు రోగికి అంటువ్యాధిని సంక్రమింప చేసే  అవకాశం ఉంది. ఇందుకు మద్దతు పలికే తన అనుభవంలోకి వచ్చిన ఒక సంఘటనను ఆ వైద్యుడు మాకు  వివరించాడు. నాభి దగ్గర గాయంతో బాధపడుతున్న నాలుగు మాసాల వయస్సు గల తమ శిశువుకు చికిత్స నిమిత్తం ఒక  జంట నా వద్దకు వచ్చింది. తమ శిశువుకు చికిత్స కోసం గతంలో తాము బాబాను ఆశ్రయించినట్లు వాళ్ళు నాతో  చెప్పారు. శిశువు దేహంపై 'చాచవా'ను ఉంచడంతో వ్యాధి విషమించింది. చివరకు వాళ్ళు వైద్యుని దగ్గరకు  వచ్చారు. నెలరోజుల వైద్య పర్యవేక్షణలో శిశువు ఆరోగ్యం కుదుటపడింది.