Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లికి ఘనంగా అంత్యక్రియలు...

పిల్లికి ఘనంగా అంత్యక్రియలు...
ఏది నిజం శీర్షికలో మీకు అద్భుతమైన, నమ్మలేని నిజాలను గురించి చెపుతూ వస్తున్నాం. అయితే ఈ వారం మీకు చూపబోయే ఘటన ఇంతవరకు ప్రచురించిన అంశాలకంటే భిన్నమైంది. జంతువుల పట్ల ప్రజలు అపార అభిమానం చూపిస్తారని మనకు తెలుసు.

లక్షలాది సంవత్సరాలుగా మానవులు, జంతువులు కలిసే జీవిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో జంతుప్రేమ కూడా దాని పరిధులను మించిపోతుంది. ప్రచారాసక్తితో ప్రజలు కొన్ని అసాధారణ చర్యలను చేపడతారు. దీంతో జంతువులపై వారు చూపించే ఆదరణ ప్రదర్శన మాత్రంగా మారిపోతుంది.
పిల్లిపిల్లకు అంత్యక్రియలు
  పిల్లిపిల్ల అంతిమయాత్రకు వారు బ్యాండు మేళాన్ని తీసుకొచ్చారు. మనిషి చనిపోతే చేసే కర్మలన్నింటికీ వారు పిల్లి పిల్లకు కూడా నిర్వహించి సాగనంపారు      


కుక్కకు, పిల్లికి జన్మ విరోధం ఉంటుందని మనందరికీ తెలుసు. కాని ఈ కథనంలో బిల్లు అనే ఆడకుక్క, నాన్సీ అనే పిల్లి పిల్లను తన సొంత బిడ్డగా కాపాడుకుంటున్న వైనం మీరు చూస్తారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్ర్రంలోని ఇండోర్‌లో ఓ కుటుంబం వద్ద నాలుగేళ్లుగా బిల్లూ అనే ఆడకుక్క పెరుగుతోంది. ఒకరోజు ఈ కుటుంబ సభ్యులు తమ ఇంటికి దగ్గరగా దయనీయ పరిస్థితుల్లో ఉన్న పిల్లి పిల్లను చూశారు.

అయితే దీని ముఖం కూడా తమ ఇంటి కుక్క బిల్లు ముఖాన్ని పోలి ఉండటంతో వారు దాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఏ మూలో వారికి భయం కలిగింది. వీటి మధ్య ఉన్న బద్ధ వైరుధ్యం రీత్యా ఆ చిన్న పిల్లి పిల్లను కుక్క తప్పకుండా చంపివేస్తుందని వారు భావించారు.

అయితే వారి భయం నిజం కాలేదు. కొత్తగా వచ్చిన అతిథిని బిల్లు తన స్వంత బిడ్డగా స్వీకరించింది. ఆశ్చర్యకరంగా అది పిల్లి పిల్లకు పాలు కూడా ఇవ్వడం మొదలెట్టింది. వీటి యజమాని ఈ విషయమై వెటర్నరీ సర్జన్‌ను సంప్రదించగా, మానసిక ప్రభావంతోటే పిల్లి పిల్లకు కుక్క పాలు ఇస్తోందని చెప్పాడు.
WD


అయితే భిన్న జంతువుల మధ్య ఈ అభిమానం అట్టే కొనసాగలేదు. పది నెలల లోపే పిల్లి పిల్ల చనిపోయింది. దీంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. తర్వాత ఓ కొత్త డ్రామా ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు పిల్లిపిల్లకు అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. పిల్లిపిల్ల అంతిమయాత్రకు వారు బ్యాండు మేళాన్ని తీసుకొచ్చారు. మనిషి చనిపోతే చేసే కర్మలన్నింటికీ వారు పిల్లి పిల్లకు కూడా నిర్వహించి సాగనంపారు.

జంతువుల పట్ల దయ, ఆదరణ చూపటాన్ని ఎవరయినా అభినందించవలసిందే. అయితే జంతుప్రేమను చాటుకోవడానికి ఇలాంటి వినూత్న చర్యలకు దిగటం అవసరమేనా... అనేక సందర్భాల్లో ప్రజలు ప్రచారార్భాటం కోసమే తమ జంతువుల పట్ల ఆదరణను ప్రదర్శిస్తుంటారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను మాకు రాయండి.

Share this Story:

Follow Webdunia telugu