Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అశ్వత్థామ ఎవరు?

అశ్వత్థామ ఎవరు?

Shruti Agarwal

, సోమవారం, 27 ఆగస్టు 2007 (16:09 IST)
మహాభారత కాలంలో... అంటే ద్వాపర యుగంలో అశ్వత్థామ జన్మించాడు. కౌరవులకు పాండవులకు యుద్ధ విద్యను నేర్పిన మహాగురువు. ద్రోణాచార్యుని కుమారుడు. ఈయన మామ కృపాచార్యుడు.

మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు కౌరవులపక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుడు, అశ్వత్థామలిద్దరూ కలిసి తమ యుద్ధ నైపుణ్యంతో పాండవుల సైన్యాన్ని పెద్ద సంఖ్యలో మట్టుపెడతారు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ దీనికి అడ్డుకట్ట వేయటానికి వ్యూహరచన చేస్తాడు. దీనికోసం ఏమైనా చేయమని ధర్మరాజును అర్థిస్తాడు. వారి ప్రణాళిక ప్రకారం, యుద్ధంలో అశ్వత్థామ మరణించాడన్న పుకారును సంగ్రామ ప్రదేశంలో వ్యాపింప చేస్తారు. ఈ విషయాన్ని నిర్థారణ చేసుకునేందుకు ద్రోణాచార్యుడు ధర్మరాజు వద్దకు వెళతాడు.

ద్రోణాచార్యుని ప్రశ్నకు ధర్మరాజు బదులు ఇస్తూ... అశ్వత్థామ హతః అని ఆ తర్వాత ద్రోణునికి వినబడకుండా కుంజరః అన్నాడు. చివరి పదాన్ని గమనించని ద్రోణాచార్యుడు పుట్టెడు దుఃఖంతో కుంగిపోయాడు. పుత్రుడు మరణించాడన్న విషయాన్ని విన్నవెంటనే ఆయన అశక్తుడవుతాడు. అదే అదనుగా తీసుకుని ద్రుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని వధిస్తాడు.

దీనితో అయితే అశ్వత్థామ మాత్రం మరణించలేదు... అశ్వత్థామ అన్న పేరుగల ఏనుగు సంగ్రామంలో అసువులుబాసింది. తండ్రి మరణించాడన్న విషయాన్ని తెలుసుకున్న అశ్వత్థామ కోపోద్రిక్తుడవుతాడు. పాండవులందరినీ చంపాలని నిర్ణయించుకుంటాడు. అయితే బ్రహ్మస్త్రను ఉత్తర అనే గర్భిణీ మహిళపై వేసి ఆమె కుమారుడైన పరిక్షిత్‌ను సంహరించాలనుకుంటాడు. అయితే పరిక్షిత్‌ను శ్రీకృష్ణుడు రక్షిస్తాడు. ఆ తర్వాత అతని నుదిటి మీద ఉన్న మణిని శ్రీకృష్ణుడు తీసుకుని కొన్ని యుగాలపాటు భూమిపై సంచరించమని శపించాడు.

అసీర్ఘర్ కోట వెనుకన నర్మదా తీరం గౌరీఘాట్‌కు దగ్గర్లో ఉన్న జబల్పూర్ వాస్తవ్యులు ఇప్పటికీ అశ్వత్థామ అక్కడ సంచరిస్తూనే ఉన్నాడని అంటున్నారు. అంతేకాదు తన నుదుటి నుంచి వస్తున్న రక్తాన్ని ఆపివేసేందుకు అవసరమైన నూనెలు, ఔషధాల కోసం అశ్వత్థామ అడుగుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu