Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

మానవ శరీరంలో దేవత

Advertiesment
మధ్యప్రదేశ్ ఇండోర్ మానవ శరీరం దుర్గాదేవి నిప్పులు
మానవ శరీరంలో అమ్మవారి ప్రతిరూపాన్ని మీరెప్పుడైనా చూశారా...? అమ్మవారు తనలో ప్రవేశించిందిని చెప్పుకునే వ్యక్తి, కణకణలాడే నిప్పులపై నడువగలడా...? ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి మిమ్మల్ని అటువంటి వ్యక్తుల గురించి పరిచయం చేయబోతున్నాం. వారంతా చెప్పేదేమిటంటే అమ్మవారు తన భక్తులకు సహాయపడేందుకు వారివారి శరీరాలలోకి ప్రవేశిస్తుందట.

ఈ నిజం మీకు తెలియజేయటానికి మిమ్మల్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని ఓ దేవాలయం వద్దకు తీసుకువెళుతున్నాం. ఇక్కడ కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయంలో, అమ్మవారికి ప్రార్థన చేసే సమయంలో దేవి కొందరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ప్రవేశించిన స్త్రీలు లేదా పురుషులను టైగర్ లేదా కాల భైరవునిగా సంబోధిస్తారు. ఇలా అమ్మవారు పూనిన వ్యక్తుల ప్రవర్తన అసాధారణంగా ఉంటుంది.

వారంతా తమతోపాటు దుర్గామాతను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను దీవిస్తుంటారు. దుర్గామాత తమ శరీరాన్నంతా ఆవహించిందని భావించినవారు అమ్మవారి లీలా విశేషాలకు గుర్తుగా తమ నాలుకలపై మండుతున్న కర్పూరాన్ని ఉంచుకుంటారు. మరికొందరైతే మండుతున్న హారతి కర్పూరాన్ని తమ అరచేతులపై పెట్టుకుంటారు.

FileWD
ఇదేకాదు, తమతమ శరీరంలోకి అమ్మవారు, కాలభైరవుడు ఆవహించినట్లు భావింపబడేవారు కలిసి నాట్యం చేస్తారు. కనీసం పాదరక్షలు ధరించకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు. వీరు చేసే ఈ పనులకు మిగిలిన భక్తులు సహకారమందిస్తుంటారు. ఎందుకంటే ఇదంతా దుర్గామాతను కొలిచే తంతులో భాగమే మరి.

ఇలా ఒక వ్యక్తిలో అమ్మవారు ప్రవేశించటం... ప్రవేశించిందని భావింపబడిన వ్యక్తులను పూజించటం అనేవి భక్తికి సంకేతంగా చెప్పవచ్చా...? లేదంటే దుర్గామాత తన భక్తుల శరీరంలోకి ప్రవేశించడం అనే అంశం కేవలం భక్తులను ఆకర్షించడానికి చేస్తున్న జిమ్మిక్కా...? దీనిపై మీరేమి ఆలోచిస్తున్నారు...? దయచేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Share this Story:

Follow Webdunia telugu