Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దెయ్యాల పనిపట్టే కాళీ మసీదు....

దెయ్యాల పనిపట్టే కాళీ మసీదు....
, మంగళవారం, 1 జులై 2008 (11:19 IST)
WD PhotoWD
దుష్ట శక్తులు అనేవి అసలు ఆవరిస్తాయా...? ఇటువంటి శక్తులు ఒక మందిరాన్ని దర్శించటం వల్ల పారదోలబడతాయా...? ఏదినిజం శీర్షికలో భాగంగా ఈ దుష్ట శక్తులను వదిలించే ప్రదేశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. దీని పేరు కాళీ మసీదు. దుష్ట శక్తులు తమను ఆవరించాయని నమ్మేవారు ప్రతి గురువారం ఈ మసీదును సందర్శిస్తుంటారు.

నిజానికి కాళీ మసీదు పేరు తెలియని ఓ సన్యాసికి సంబంధించినదిగా చెపుతారు. స్మశానానికి సమీపంలో వున్న ఈ మసీదు కాళీ మసీదుగా ప్రజలచేత పిలువబడుతోంది. తమకు భూతాలు, దెయ్యాలు పట్టాయని అనుకునేవారు చాలా మంది ఈ మసీదును దర్శించి బాబాకు ప్రార్థనలు జరుపటం ద్వారా తమకు పట్టిన దుష్ట శక్తులను వదిలించుకుంటారు.

ఈ మందిరం గురించి పలు ప్రశ్నలు తలెత్తుతాయి. బాబా అంటే ఎవరు? ఆయన పేరేమిటి? కాళీ మసీదు అనే పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరికీ తెలీదు. దెయ్యాలను వదిలిస్తామంటూ చెప్పుకుంటున్న పవిత్ర స్థలాలు చాలానే ఉన్నాయి కాని ఏ మందిరానికి లేని ప్రత్యేకత ఈ కాళీ మందిరానికి ఉండటం
webdunia
WD PhotoWD
ఓ విశేషం.

ఈ మసీదు ఆవిర్భావం వెనక అనేక కథలు వున్నాయి. ఇది 1100 ఏళ్ల నాటిదని కొందరంటే... కాదు కాదు 101 సంవత్సరాలనాటిదని మరికొందరు చెపుతారు. దెయ్యం పట్టిందనీ, దానిని వదిలించుకోవటానికంటూ... ఎప్పటి నుంచి ఈ మసీదును ఆయా వ్యక్తులు దర్శిస్తున్నారన్న విషయం కచ్చితంగా తెలియదు.

దెయ్యాలను పారదోలే వ్యవహారం గురించి మేము పూజారి అర్జున్ సింగ్‌ను అడిగినప్పుడు అతను ఇలా చెప్పుకొచ్చాడు. "ఎవరైతే దుష్ట శక్తుల బారినపడి బాధపడుతుంటారో... వారు వరుసగా ఐదు గురువారాలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలు. బాబా ప్రసన్నుడై వారికి పట్టిన దుష్ట శక్తులను పారదోలతాడు. అంతేకాదు వారికి తిరిగి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు."

webdunia
WD PhotoWD
ప్రతి సంవత్సరమూ కాళీ మసీదు వద్ద ఉరుసు (మొహమ్మద్ ప్రవక్త సమాధి వద్ద ఉత్సవాలు జరిపే రోజు) జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రకారం, ప్రార్థనల కార్యక్రమం ముగిసిన తర్వాత పేద ప్రజలకు భోజనం పెడతారు. బాబా భక్తులలో ఒకరైన వమిక్ షేక్‌ను ఈ విషయంపై విచారించగా అతను ఇలా చెప్పుకొచ్చాడు. జీవితంలో తను సమస్యలలో ఇరుక్కున్నప్పుడు వెంటనే బాబాను సందర్శిస్తారు.

తద్వారా తాను వాటినుంచి బయటపడతాననీ చెప్పాడు. అంతేకాదు అతను మరో విషయం కూడా చెప్పాడు. ఎవరైతే మానసికంగా, భౌతికమైన సమస్యలతో సతమతమవుతుంటారో, వారు బాబా మందిరాన్ని సందర్శించి పూజలు నిర్వహించటం ద్వారా వాటిని వదిలించుకోవటం తాను కళ్లారా చూశానంటున్నాడు.

అయితే సైన్స్ మాత్రం భూత ప్రేతాలు లేనేలేవని ఎప్పటినుంచో నొక్కి చెపుతోంది. ఒకవేళ ఎవరైనా నమ్మినా అవన్నీ వట్టి మూఢ విశ్వాసాలని కొట్టి పారేస్తోంది. మరోవైపు దుష్టశక్తులు తరిమివేయబడినాయి అనేందుకు పూర్తి సాక్ష్యాధారాలు ఇప్పటివరకూ ఎక్కడా అగుపించిన దృష్టాంతాలు లేనేలేవు.

మరి ప్రజలు కాళీ మసీదు వంటివాటిని ఎందుకు దర్శిస్తున్నారు...? ఇలాంటి ప్రదేశాలను సందర్శించటం వల్ల వారు నిజంగానే దుష్ట శక్తులను వదిలించుకోగలుగుతున్నారా...? మా ఈ ప్రశ్నలను మీ ముందు వుంచుతున్నాం. మీ అభిప్రాయాలను మాకు తెలుపుతారు కదూ...

Share this Story:

Follow Webdunia telugu