Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దెయ్యాల్ని పారద్రోలే మహార్తి పూజలు

Advertiesment
దత్త భగవానుడు దెయ్యాలు భూతాలు దుష్టశక్తులు మహా హారతి
, సోమవారం, 5 మే 2008 (18:40 IST)
WD
దుష్టశక్తులు తరిమేందుకై కర్పూర హారతి ఇస్తున్న పళ్లాన్ని భక్తులు చేతితో విచిత్రంగా పట్టుకునే దృశ్యాన్ని మధ్యప్రదేశ్‌లోని బిజాల్‌పూర్‌‍లో ఉన్న దత్తా దేవాలయంలో చూడవచ్చు. ఈ పూజలో పాల్గొనే భక్తులను పీడిస్తున్న దుష్టశక్తులు వారిని వీడి వెళతాయనేది స్థానికుల విశ్వాసం. ఈ విచిత్రమైన పూజల గురించి తెలిసిన వెంటనే ఆ గుడిని కనీసం ఓ సారైనా దర్శించి, అక్కడి విశేషాలను తెలుసుకోవాలని బయలుదేరాం. దత్తుని గుడికి వెళ్లే ముందు అక్కడ ఓ ఎరుపు జెండా గుడిపై చాలా ఎత్తున ఎగురుతుండటం మాకు కన్పించింది. దేవాలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి ఉన్నారు. సాధారణంగా శుక్రవారాల్లోనే ఈ పూజలు నిర్వహిస్తారని భక్తుల ద్వారా ముందే తెలుసుకున్నాం.
మహా హారతితో దెయ్యాలు పరార్
  దత్ మహారాజ్ ఆత్మ తనలో ప్రవేశించడం ద్వారా ఈ పూజల్లో పాల్గొనే భక్తుల బాధలను, వ్యాధులను నయం చేస్తోందని చెబుతున్నారు. మేము ఆయనతో మాట్లాడుతుండగానే మహా హారతి ప్రారంభమైంది      


భక్తులందరూ ఉమ్మడిగా ఈ హారతి ఇస్తున్నారు. దీనికోసమే వివిధ ప్రాంతాల నుంచి వారు అక్కడకు వచ్చారు. గర్భగుడిలో దత్తా స్వామి వారు సర్వాభరణ అలంకరణలతో కను విందు చేస్తున్నారు. ఏడు వందల సంవత్సరాల కిందట ఈ దేవాలయం నిర్మించబడిందని పూజారి మహేశ్ మహరాజ్ తెలిపారు. వంశపారంపర్యంగా తాము స్వామివారి సేవలో పాలు పంచుకుంటున్నామన్నారు. తాను ఏడో తరానికి చెందిన వాడినని తెలిపారు.
webdunia
WD


పూర్వం తమ వంశానికి చెందిన హరినుమా సాహెబ్ 12 సంవత్సరాల కఠోర తపస్సు చేయడంతో దత్తాత్రేయ స్వామి అనుగ్రహించాడని తమ పూర్వీకుల ద్వారా తెలిసిందన్నారు. కావాల్సిన వరం కోరుకోమని స్వామి వారు సూచించగా, ఈ దేవాలయంలోనే కొలువుండాలని ఆయన కోరుకున్నాడని తెలిపారు. దీంతో అప్పటి నుంచి దత్తాత్రేయ స్వామి ఆత్మ ఈ దేవాలయంలోనే ఉంటోందని చెప్పారు.

webdunia
WD
దత్ మహారాజ్ ఆత్మ తనలో ప్రవేశించడం ద్వారా ఈ పూజల్లో పాల్గొనే భక్తుల బాధలను, వ్యాధులను నయం చేస్తోందని చెబుతున్నారు. మేము ఆయనతో మాట్లాడుతుండగానే మహా హారతి ప్రారంభమైంది. హారతి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడగా, అందులో మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. వారి చేతుల్లో కర్పూర హారతి పళ్లెం ఉంది. దత్తా స్వామికి హారతి ఇస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. శ్లోకాలు పఠిస్తూనే కొందరు భక్తులు విచిత్రమైన రీతిలో ఏడుస్తు0డగా, మరి కొందరు నేలపై పడి పొర్లుతున్నారు. హారతి సందర్భంగా ఆత్మలు ముందుకు వస్తున్నాయని కొందరు చెప్పారు. వారి శరీరంలో దాగిన దుష్టశక్తుల కారణంగానే ఈ రకమైన విచిత్ర ప్రవర్తన చోటు చేసుకుంటోందని పేర్కొన్నారు.

జితేంద్ర పటేల్ అనే భక్తుడితో మాట్లాడగా, అతను తన భార్యకు దెయ్యం ఆవహించినందునే ఈ దేవాలయానికి వచ్చానన్నాడు. చాలా రోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడక, ఏమీ తినక అలాగే ఉండేదని, ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితిలో కొంత మెరుగు కన్పించిందన్నారు. జితేంద్ర తరహాలోనే పలువురు ఇలాంటి మార్పులను తామూ చూస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో దత్తా స్వామి అనుగ్రహంతో తనకు పూర్తిగా నయమై, ఆరోగ్యంగా ఉన్నానని జమునాభాయ్ తెలిపింది.
webdunia
WD


కొన్ని ఆత్మలు వారిని ఆవహించిందనడం కన్నా వీరు కొన్ని రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని మేము భావించాం. వారిపై వెంటనే దృష్టి సారించి, చికిత్స అందించాల్సి ఉందనుకుంటున్నాం. ఈ ఉదంతం చూసిన తర్వాత మేము కొందరు వైద్యులను కూడా ఈ విషయంపై అభిప్రాయం కోరాం. ఇది మానసిక సమస్యకు సంబంధించిన వ్యాధి అయినప్పటికీ, వారిని పూర్తిగా మానసిక వికలాంగుల జాబితాలో చేర్చలేమని అభిప్రాయపడ్డారు. సకాలంలో వారికి తగిన పద్ధతిలో చికిత్స అందిస్తే అది పూర్తిగా నయం కాగలదని చెబుతున్నారు. మీరేమనుకుంటున్నారో చెప్పండి.

Share this Story:

Follow Webdunia telugu