Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుష్టశక్తుల భరతం పట్టే చెట్టు...

దుష్టశక్తుల భరతం పట్టే చెట్టు...
, సోమవారం, 7 జులై 2008 (21:00 IST)
WD
మహిళలు చెట్టుమీదికి ఎగబాకితే వారిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులు వదిలిపెట్టి పోతాయా? బురదనీటిలో స్నానం చేస్తే మనుషులకు పట్టిన దుష్టశక్తుల పీడ తొలగిపోతుందా? ఈ ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి ఈవారం మిమ్మల్ని ఓ చెట్టువద్దకు తీసుకెళ్లుతున్నాం... విశేషం ఏమిటంటే దుష్ట శక్తుల బారిన పడిన వ్యక్తులు ఈ చెట్టుమీదికి ఎక్కి వాళ్లకు పట్టిన గ్రహాలను వదిలించుకుంటున్నారు మరి...

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయని జిల్లాలో ఓ పల్లె ఉంది. ఈ పల్లెలోనే మనం చెప్పుకుంటున్న మహిమ కలిగిన చెట్టు ఉంది. జనం విశ్వాసాల ప్రకారం, దుష్టశక్తులు పట్టిన మహిళలు ఈ చెట్టుమీదికి ఎక్కితే అవి వారిని వదిలిపెట్టి పారిపోతాయట. ఈ చెట్టు ఒక ముస్లిం మతగురువు సమాధికి సమీపంలో ఉంది. ఈ మందిరంలో ఉండే బాబా మహిళలను బురదనీటిలో స్నానం చేసి రమ్మని ఆదేశిస్తాడట. బురదనీటిలో స్నానం చేసిన తర్వాత ఈ చెట్టు ఎక్కిన మహిళలు, గ్రహాలు పూని తాము అనుభవిస్తున్న బాధలను వ్యక్తం చేస్తూ చిత్ర విచిత్రంగా అరుస్తారు.
దెయ్యం పట్టిందా... ఐతే చెట్టెక్కండి
  పట్టిన దయ్యాన్ని వదిలించటానికి ఖాజీ-ముస్లిం మతగురువు- సంబంధిత వ్యక్తి తల వెంట్రుకలను పట్టుకుని గోడకు ఆనించి నిమ్మకాయతో కొడతాడు      


ఈ పల్లెకు మేం పోయేసరికి సంతోష్ అనే వ్యక్తి ఎదురయ్యాడు. బాబాను కలుసుకునేందుకు అతడు ఇక్కడి బాబామందిరం వద్దకు వచ్చాడు. తను ఎదుర్కొంటున్న సమస్యకు వైద్యుడు పరిష్కారం కనుగొనక పోవడంతో నేరుగా ఇక్కడికే వచ్చేశాడు. బాబా అతడు చెప్పింది విని, అతడికి పట్టిన గ్రహాలను వదిలించి అతడి సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు.

webdunia
WD
సాధారణంగా అయితే ఈ చెట్టును మహిళలు ఎక్కడం అంత సులభం కాదని ప్రజల నమ్మకం. బాబా ఆదేశంతో మాత్రమే మహిళలు, అమ్మాయిలు తేలిగ్గా ఈ చెట్టును ఎక్కగలుగుతారట. పట్టిన దయ్యాన్ని వదిలించటానికి ఖాజీ-ముస్లిం మతగురువు- సంబంధిత వ్యక్తి తల వెంట్రుకలను పట్టుకుని గోడకు ఆనించి నిమ్మకాయతో కొడతాడు. తర్వాత ఆ వ్యక్తి వెంట్రుకలను కత్తిరించడం ద్వారా పట్టిన దెయ్యాన్ని వదిలిస్తాడు. దీంతో తమను ఇంతకాలంగా పట్టి పీడిస్తున్న దెయ్యాల బాధనుంచి మహిళలు విముక్తి పొందుతారట. ఈ ప్రక్రియ అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందని గ్రామస్తులు చెప్పారు.

మందిరంలోని బాబాను సందర్శించటానికి ప్రతిదినం భక్తులు వరుసలో నిలబడతారు. బాబా ఆశీస్సులు పొందగలిగితే తమను పీడిస్తున్న దుష్టశక్తుల పీడ వదిలించుకోవచ్చని భక్తుల నమ్మకం. దీని గురించి మీరేమనుకుంటున్నారు..... మీ అభిప్రాయం గురించి మాకు రాయండి.

Share this Story:

Follow Webdunia telugu