Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ దేవాలయానికి మద్యపానం, సిగరెట్లే నైవేద్యం

ఆ దేవాలయానికి మద్యపానం, సిగరెట్లే నైవేద్యం
WD
సహజంగా ఆయా దేవాలయాల్లో భక్తులు భగంవతునికి కొబ్బరికాయలు, పూలు, పండ్లు ఇత్యాది వస్తువులను సమర్పించుకోవడాన్ని మనం చూస్తుంటాం. మద్యపానం, సిగరెట్లు ఓ ఆలయానికి సమర్పించడాన్ని మీరెక్కడైనా చూశారా...? దాదాపు చూసి వుండకపోవచ్చు.

ఇటుంవటి వస్తువులను ఓ ఆలయానికి సమర్పించడాన్ని మేము చూశాం. అందుకే ఈ వారం ఏదినిజం శీర్షికలో ఆ దేవాలయానికే మిమ్మల్ని తీసుకుని వెళ్లదలిచాం. బరోడాకు సమీపంలో వున్న మంజల్‌పూర్‌లో వున్న ఈ దేవాలయాన్ని జీవ మామా ఆలయమని పిలుస్తారు. జీవ మామకు మద్యం, సిగిరెట్లు సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని వినడంతో అక్కడికి చేరుకున్నాం.

గుజరాత్‌లో మద్యాన్ని నిషేధించినప్పటికీ భక్తులు మాత్రం తమ కోర్కెలు నెరవేర్చుకునేందుకు ఎలాగైనా మద్యాన్ని సాధించి దేవాలయానికి సమర్పించడం గమనార్హం. కేవలం మద్యం, సిగరెట్లే కాదు కొన్ని సార్లు జంతు బలులను కూడా ఇస్తుంటారు. ఈ సంప్రదాయాల వెనుక వున్న చరిత్ర అత్యంత ఆసక్తిని రేకిత్తించేదిగా వుంటుంది.
జీవా మామ కోర్కెలు తీరుస్తాడట...
  తాము అనుకున్న కోర్కెలను జీవాకు విన్నవిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరిన పిదప వారు జీవా మామకు మద్యం, సిగిరెట్లు సమర్పించుకుంటారు. అలా ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇలా కొనసాగుతూనే వుంది      


స్థానికుడైన శ్రీ భరత్ భాయ్ సోలంకి ఆలయ చరిత్రను గురించి ఇలా చెప్పుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం, ఓ ప్రత్యేక ఉత్సవంకోసం ఆ ఊరి ప్రజలందరూ గ్రామాన్ని విడిచి వెళ్లారు. గ్రామస్తులెవరూ ఊర్లో లేకపోవడంతో దోపిడీ ముఠా ఒకటి ఊరును దోచుకునేందుకు ప్రవేశించింది.

అదే సమయంలో ఆ ఊరిలో నివశిస్తున్న తన సోదరిని చూసి వెళ్లేందుకు వచ్చిన జీవా అనే వ్యక్తి దొంగల ముఠాను అడ్డుకునే ప్రయత్నం చేయసాగాడు. ఇంతలో ఊరి జనం కూడా అతనికి తోడవడంతో అందరూ కలిసి దొంగలను పారదోలారు. అయితే ఈ సంఘటనలో జీవా తీవ్ర గాయాలపాలై మరణించాడు.

దీంతో... జీవా జ్ఞాపకార్థం, జీవా మామ ఆలయాన్ని నిర్మించారు అక్కడి ప్రజలు. అప్పటి నుంచి వారు తాము అనుకున్న కోర్కెలను జీవాకు విన్నవిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరిన పిదప వారు జీవా మామకు మద్యం, సిగిరెట్లు సమర్పించుకుంటారు. అలా ఈ సంప్రదాయం అప్పటి నుంచి ఇలా కొనసాగుతూనే వుంది.
webdunia
WD


జీవా మామకు మద్యం, మాంసం అంటే ఎనలేని ప్రీతి వుండటం చేతనే తాము ఇవన్నీ సమర్పిస్తున్నామని భక్తులు చెపుతున్నారు. ప్రస్తుతం జంతు బలులను నిషేధించటంతో జంతువుల వెంట్రుకలను సమర్పిస్తున్నారు.

ప్రజల శ్రేయస్సుకోసం ప్రాణత్యాగం చేసిన ఓ మహామనిషి జ్ఞాపకార్థం ఓ కట్టడాన్ని నిర్మించడం అభినందించదగ్గ విషయమే. అయితే మద్యం, సిగరెట్లు వంటి వస్తువులను సమర్పించడం ఎంతవరకు సమంజసం? ఓ విగ్రహానికి మద్యం, సిగిరెట్, మాంసం సమర్పించటంపై మీరు ఏమనుకుంటున్నారు...? దయచేసి మీ అభిప్రాయాలు మాకు రాయండి.

Share this Story:

Follow Webdunia telugu