Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి దర్శనం టిక్కెట్లు... 3 గంటల ముందు కూడా బుక్ చేస్కోవచ్చు... 2 గ్రాముల బంగారు డాలర్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను 25 వేలకు పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకుంది. యాత్రికుల రద్దీ సాధారణ స్థాయిని మించిన నేపథ్యంలో టిక్కెట్ల సంఖ్యను 15 వేల నుంచి 25 వేలకు తితిదే పెంచినట్లు ఈఓ సాంబశివరావు తెలిపారు. శ్రీవ

Advertiesment
శ్రీవారి దర్శనం టిక్కెట్లు... 3 గంటల ముందు కూడా బుక్ చేస్కోవచ్చు... 2 గ్రాముల బంగారు డాలర్
, బుధవారం, 29 జూన్ 2016 (12:23 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను 25 వేలకు పెంచుతూ తితిదే నిర్ణయం తీసుకుంది. యాత్రికుల రద్దీ సాధారణ స్థాయిని మించిన నేపథ్యంలో టిక్కెట్ల సంఖ్యను 15 వేల నుంచి 25 వేలకు తితిదే పెంచినట్లు ఈఓ సాంబశివరావు తెలిపారు. శ్రీవారి దర్శనానికి మూడు గంటలకు ముందుగా కూడా అంతర్జాలంలో సులభంగా టిక్కెట్లు కొనుగోలుకు అవకాశం కల్పించింది తితిదే. తితిదే ఈఓ చెప్పిన విధంగా టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
 
శ్రీవారి బంగారు వెండి.. రాగి డాలర్లకు రెండు కేంద్రాలు
తిరుమల శ్రీవారి ప్రతిమలతో కూడిన బంగారు, వెండి, రాగి డాలర్లను విక్రయించాలని తితిదే నిర్ణయించింది. ఇప్పటివరకు బంగారు డాలర్లను మాత్రమే విక్రయిస్తోంది. వీటిలో కూడా 5,10 గ్రాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండు గ్రాముల బరువు గల డాలర్లు చాలాకాలం నుంచి అందుబాటులో లేవు. భక్తుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో తితిదే ఈఓ సాంబశివరావు స్పందించారు. 
 
ఇకపై బంగారు రూపంలో 2, 5, 10 గ్రాములు, వెండి 5, 10, రాగి 5 గ్రాముల బరువుతో కూడినవి విక్రయించాలని నిర్ణయించారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో విక్రయానికి సన్నాహాలు చేస్తూ లడ్డూ ప్రసాద వితరణ శాలలో రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈఓ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఒక విక్రయ కౌంటర్‌ తిరుమలలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో నగ్న ఫోటోలేంటి? నటరాజ స్వామి తాండవ నృత్యం ఫోటోలు అస్సలుండకూడదట!