శ్రీశైల మల్లన్న ఆలయానికి సమీపంలోనే అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఇష్టకామేశ్వరి ఆలయం. ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టి ఏదైనా కొరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం అడవిలో ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుంది.
భక్తుల కోరికలు తీర్చేకల్పవల్లిగా ఈ అమ్మవారికి పేరుంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఇష్టకామేశ్వరి దేవాలయం వుంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దట్టమైన అడవీ మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో భక్తులకు దర్శనమిస్తారు. రెండు చేతులలో తామరపూలు, మిగిలిన రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి ఉంటారు. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుంది. ఈ అమ్మవారి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి మనసులో కష్టాన్ని, కోర్కెను చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ కోరిక తీరుతుంది.