Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిజిలో వ్యక్తి చనిపోతే... శవానికితోడుగా మరో వ్యక్తిని పంపుతారట...

మాములుగా మనిషి చనిపోయాక ఆచారం ప్రకారం స్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. ఒక్క భారతదేశంలోనే కాదు వివిధ రకాల మతాల వారు కూడా వాళ్ళ యొక్క మతాలు ఆచారంగా ఆ కార్య

Advertiesment
fiji country
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (09:09 IST)
మాములుగా మనిషి చనిపోయాక ఆచారం ప్రకారం స్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. ఒక్క భారతదేశంలోనే కాదు వివిధ రకాల మతాల వారు కూడా వాళ్ళ యొక్క మతాలు ఆచారంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే కొన్ని దేశాలు మాత్రం వీటికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దహనం కంటే... చనిపోయిన మనుషుల్ని కొందరు ఏం చేస్తారో తెలిస్తే ఎవరికైనా దిమ్మదిరిగి పోవాల్సిందే. ఆయా దేశాలు యొక్క ఆచారాలు, పద్ధతులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 
దక్షిణ పసిఫిక్‌లోని ఫిజి ప్రాంతంలో తమ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే, ఆ శవానికి తోడుగా మరో వ్యక్తిని పంపుతారట. ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఒకరు వారితో పాటు వారికి తోడుగా చనిపోవాలట. అందుకోసం ఆ కుటుంబంలోని మరో వ్యక్తిని వారి పక్కన కూర్చోబెట్టి గొంతుకు తాడు కట్టి చంపేస్తారు. అలా చంపే సమయంలో వారు ఎలాంటి బాధను అనుభవించరని, వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం.
 
ఈజిప్టుల ఆచారం మనకు తెలిసిందే. చనిపోయిన మృతదేహాలను గుడ్డలో చుట్టి ఒక పెట్టెలో పెడతారు. ఎక్కువగా ఈ ఆచారాన్ని ఈజిప్ట్ దేశీయులు పాటిస్తారు. ఇప్పటివరకూ ఈజిప్ట్‌లో 3500పైగా మమ్మీలు ఉన్నాయట. ఇలాచేయడం వల్ల ఆ మమ్మీలు ఏదో ఒక రోజు తిరిగి బ్రతుకుతాయని వారి నమ్మకం. ఈ పద్ధతి కేవలం ఒక్క ఈజిప్ట్ దేశంకే పరిమితం కాలేదు, భారత్, శ్రీలంక, చైనా, టిబెట్, థాయిలాండ్ దేశాలలో ఈ ఆచారాన్ని ఇప్పటికి ఫాలో అవుతున్నారు.
 
ఇది అత్యంత ఘోరమైన ఆచారం. మన దేశంలో అఘోరాలు శవాలను తిన్నట్లు, న్యూగినియా, బ్రెజిల్ దేశాలలో అక్కడి ప్రజలు చనిపోయిన శవాలను ముక్కలుగా చేసుకొని విందారగించినట్టు ఆరగిస్తారు. అయితే ప్రస్తుతం ఈ పధ్ధతి అక్కడ చాలా వరకు తగ్గిపోయింది.
 
మనదేశంలో చాలా మతాల వారు చనిపోయిన మృతదేహాలను మట్టిలో పూర్చిపెట్టి సమాధులు కడతారు. వేద కాలం నుండి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారాన్ని ఇస్లాం, క్రిస్టియన్ మతస్థులు ఇప్పటికీ పాటిస్తున్నారు.
 
చనిపోయిన వారిని కొండ చివరన రెండు చెక్కల మధ్యన లేదా ఒక రాయికి వేలాడదీసి ఉరితీస్తారు. అలా చేయడం వలన వారు స్వర్గానికి వెళతారని వారి నమ్మకం. ఇది చైనీయుల మత ఆచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం శుక్రగ్రహాన్ని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుందా? శుక్రునికి నవగ్రహాల్లో చోటెలా?