Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?

తిరుమలకు వెళ్ళిన భక్తులు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి…? చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. అప

వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి?
, బుధవారం, 20 జులై 2016 (14:22 IST)
తిరుమలకు వెళ్ళిన భక్తులు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి…? చాలామంది భక్తులకు అసలలా ఎందుకు చేయాలో తెలియదు కానీ చేసేస్తుంటారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. 
 
అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
 
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. 
 
ఈ రాగిరేకును నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవిందరాజస్వామి గుడిలో గోవిందులు.... హుండీ సొమ్ము స్వాహాయ నమః