Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం మాంసాహారం మానేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా?

ఆదివారం వచ్చిందంటే.. ప్రతి ఇంటా నోరూరించే మాంసాహార వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. నిజానికి ఆదివారం మాంసాహారం తినకూడదని పురాణాలు చెపుతున్నాయి. ఆదివారానికి, మాంసానికి సంబంధం ఏంటనే కదా ధర్మ సందేహం. అయితే, ఈ

Advertiesment
ఆదివారం మాంసాహారం మానేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా?
, శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (16:13 IST)
ఆదివారం వచ్చిందంటే.. ప్రతి ఇంటా నోరూరించే మాంసాహార వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. నిజానికి ఆదివారం మాంసాహారం తినకూడదని పురాణాలు చెపుతున్నాయి. ఆదివారానికి, మాంసానికి సంబంధం ఏంటనే కదా ధర్మ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మనం కూడా దాన్నే సెలవుదినంగా పాటిస్తూ సెలవు రోజుల్లో ఎంజాయ్ అనే పేరుతో కొంతమంది మద్యమాంసాలు ఆరగిస్తున్నారు. మరికొంతమంది మాంసాహారంతో రోజును గడిపేస్తున్నారు. ఇంకొంతమంది డాక్టర్లే మాంసం తీసుకోమని చెప్పారని, అందుకే క్రమం తప్పకుండా మాంసాహారం తీసుకుంటున్నట్టు చెపుతారు. 
 
నిజానికి ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. దీన్నే రవివారంగానూ పిలుస్తారు. ఆంగ్లంలో సైతం సన్‌డే అంటూ సూర్యుని ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యభగవానుడు ఆరోగ్య ప్రధాత. అనారోగ్యాలు ఉన్నవారిని ఆదివారం నాడు సూర్యభగవానుణ్ణి పూజించమని అర్థం. ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు పఠించమని చెబుతారు. అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వెళల్లో ఎండలో ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారని చెపుతారు. 
 
సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నది జ్యోతిష్య శాస్త్రం చెపుతున్న వాస్తవం. మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది. దానివల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేము. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడుతాయి. ఆదివారం మాంసాహారం తీసుకోకుండా, ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట. అంతేకాకుండా, ఆ ఆరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. 
 
కావాలంటే 7 ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికిసంబంధించిన స్తోత్రాలు చదవండి. మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం లాంటివి చేయండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనించవచ్చు. పైగా, మాంసాహారం తినేవారు 7 ఆదివారాల పాటు మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల వచ్చే ప్రమాదం లేదా నష్టమేమీ లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీనివాసుడు పూజించిన దేవుడు ఎవరు?