Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకృష్ణుడు శృంగార స్వరూపుడా? ఆయన శిఖపై నెమలిఫించం ఎందుకుంటుందో తెలుసా..?

శ్రీకృష్ణుడు అంటేనే ముందుగా ఆయన అష్టభార్యలు, 16వేల మంది గోపికలు గుర్తుకు వస్తారు. అలాగే శ్రీకృష్ణుడ్ని శృంగార రూపంగా భావిస్తారు. ఏ అవతార పురుషునికీ లేనన్నీ భార్యలు శ్రీకృష్ణుడికి ఉంటారు. నాస్తికులు, ఆ

శ్రీకృష్ణుడు శృంగార స్వరూపుడా? ఆయన శిఖపై నెమలిఫించం ఎందుకుంటుందో తెలుసా..?
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (14:30 IST)
శ్రీకృష్ణుడు అంటేనే ముందుగా ఆయన అష్టభార్యలు, 16వేల మంది గోపికలు గుర్తుకు వస్తారు. అలాగే శ్రీకృష్ణుడ్ని శృంగార రూపంగా భావిస్తారు. ఏ అవతార పురుషునికీ లేనన్నీ భార్యలు శ్రీకృష్ణుడికి ఉంటారు. నాస్తికులు, ఆస్తికులు కూడా కృష్ణుడిని కామ స్వరూపమేనని భావిస్తారు. కానీ కృష్ణ తత్త్వాన్ని ఎవ్వరూ తప్పుగా భావించరాదని.. శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగేశ్వరుడని తెలియజెప్పడానికే కృష్ణుడి శిఖలో నెమలి ఫించం ఉంటుంది. 
 
పవిత్ర సూచకంగా గోమాత వుంటుంది. శ్రీ కృష్ణుడు కాముక జన్ముడు కాదు. కారకజన్ముడు. పూర్వం నరకాసురుడు భైరవ పూజ కోసం ప్రపంచం నలుమూల నుంచి  రాజ కన్యల్ని అపహరించి తన పాతాళ గృహంలో బంధించాడు. ఎన్నో సంవత్సరాల పాటు పాతాళ చెరలో 16వేల మంది కన్యలు నరకం అనుభవించారు. నరకాసుర వధకు తర్వాత శ్రీ కృష్ణుడు నరకాసురిని కుమారుడికి రాజ్యం అప్పగించి.. కన్యలను వారి వారి దేశాలను చేర్చాలని ఆదేశించాడు. 
 
కానీ ఆ కన్యలు మాత్రం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు నిరాకరిస్తారు. ఇంకా కృష్ణుడితోనే ఉండిపోతాం అంటూ పట్టుబడుతారు. ఎంత వారించినా 16వేల మంది కృష్ణుడిని వివాహం చేసుకోవాలనుకుంటారు. ద్వారక నగరానికి వచ్చి కృష్ణుడితో వుండిపోవాలని నిశ్చయించుకుంటారు. అందుకు కృష్ణుడు నిరాకరిస్తాడు. దీంతో ఆ కన్యలు ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడతారు.
 
వేరే గత్యంతరం లేక శ్రీకృష్ణుడు 16వేల మంది కన్యలను వివాహం చేసుకోవాల్సి వస్తుంది. కృష్ణ సహచర్యాన్ని వరంగా పొంది జన్మించిన ఆ 16వేల మంది.. కృష్ణుడి ప్రమేయం లేకుండానే ఆయన భార్యలైనారు. అంతేకానీ శ్రీకృష్ణుడు భోగలాలసుడు కాదు. ఇక నెమలి ఫించం అన్నీ మతస్థులకు పవిత్రమైనది. మహమ్మదీయుల దర్గాల్లోనే నెమలిఫించం తప్పకవుంటుంది.
 
అందుకే నెమలి పింఛం పవిత్రను ఎరిగి.. భారత ప్రభుత్వం జాతీయ పక్షిగా నెమలిని గుర్తించింది. ఆడా మగా కలిసి సంభోగం చేయని ప్రాణి నెమలి ఒక్కటే. మగ నెమలి కంటినీటిని తాగి ఆడ నెమలి గుడ్డు పెడుతుంది. ఈ పవిత్ర పక్షి నెమలి ఈకలు తలపై ధరించడానికి కారణం శ్రీకృష్ణుడు తన పవిత్రను లోకానికి చాటిచెప్పడం కోసమేనని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాసుడు తిరుమలలోనే ఎందుకు వెలిశాడో తెలుసా?