హనుమంతునికి తమలపాకుల మాలను సమర్పిస్తే?

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:57 IST)
దశావతారంలో ఒకటైన రామావతారం విశిష్టమైనది. రామబంటుగా, చిరంజీవి అయిన హనుమంతుని పూజతో ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఇంకా శ్రీరామ భక్తుడైన హనుమంతునికి తమలపాకుల మాలను సమర్పిస్తే...అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంజీవని కొండనే చేతినెత్తిన ధీరుడైన హనుమంతుడు.. భక్తుల కోరికలను కూడా సులభంగా తీరుస్తాడని విశ్వాసం.

సీతమ్మ తల్లి అశోకవనంలో వున్నప్పుడు హనుమంతుడు ఆమె వద్దకు రాముని దూతగా వెళ్తాడు. రాముని గురించి వివరాలను ఆమెకు తెలియజేస్తాడు. రాముని ఉంగరాన్ని ఆమెకు చూపెడతాడు. దీంతో సీతమ్మ సంతోషానికి అవధుల్లేవు.

ఆ సమయంలో హనుమంతునికి సీతమ్మ ఆశీర్వదించింది. ఇందులోభాగంగా తన చేతికి అందిన చోట పెరిగిన తమలపాకును గిల్లి.. హనుమంతుని తలపై చల్లింది. అలా సీతమ్మ చేత తమలపాకుతో ఆశీర్వాదం పొందిన హనుమంతుడికి.. తమలపాకు మాలను సమర్పించడం ద్వారా ప్రీతి చెందుతాడట. అందుకే తమలపాకులను ప్రతి శుభకార్యానికి వినియోగిస్తారు. తద్వారా హనుమంతుని అనుగ్రహంతో మంగళం చేకూరుతుందని విశ్వాసం.

ఇంకా తమలపాకుల మాలను హనుమంతునికి సమర్పిస్తే.. శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. హనుమాన్‌కు తమలపాకు మాలను ధరింపజేయడం ద్వారా సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. వివాహ దోషాలు తొలగిపోతాయి. వ్యాపారంలో వృద్ధి వుంటుంది. ఉన్నత పదవులు లభిస్తాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 03-04-2020 శుక్రవారం మీ రాశిఫలాలు