కృష్ణార్జున స్నేహం గొప్పదా? కృష్ణకుచేలుర స్నేహం గొప్పదా?
"యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు. కలియుగారంభం కోసం కురుక్షేత్రయుద్ధ సంగ్రామాన్ని నిర్వర్తించిన దేవుడు శ్రీకృష్ణుడు. దుష్
"యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా నిలిచినవాడు శ్రీకృష్ణుడు. కలియుగారంభం కోసం కురుక్షేత్రయుద్ధ సంగ్రామాన్ని నిర్వర్తించిన దేవుడు శ్రీకృష్ణుడు. దుష్టసంహారనార్థం జన్మించిన జగద్ రక్షకుడు శ్రీకృష్ణుడు. దశావతారాల్లో తొమ్మిదో అవతార పురుషుడిగా జన్మించాడు. అలాంటి మహిమాన్వితుడైన శ్రీకృష్ణుడికి అర్జునుడు, కుచేలుడు స్నేహితులు.
అయితే వీరిద్దరిలో ఎవరి స్నేహం గొప్పదో తెలుసుకోవాలంటే..? ఈ కథనం చదవండి. కృష్ణార్జునులు నరనరాయణులుగా జన్మనెత్తిన అవతారమూర్తులు. ఒకరికొకర బంధువులు. గాఢ స్నేహితులు. అయితే అర్జునుడు కృష్ణుడిని ప్రార్థిస్తున్న ప్రతి సందర్భంలోనూ, నమస్కరిస్తున్న ప్రతి సంఘటనలోనూ తానూ, తన రాజ్యము గురించే ఆలోచనలు వుండేవి. ఇక కృష్ణకుచేలురు భగవత్ భాగవత సంబంధం కలిగిన వారు.
ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించారు. కృష్ణుడిని కుచేలుడు నమస్కరించే సందర్భంలో- ఇలాంటి ఆలోచనలు ఏమీ అతడికి లేవు. తన ధర్మం, భగవద్ధ్యానం, తన కర్తవ్యం, పరమేశ్వర ఆరాధనం.. ఇవి తప్ప వేరో ఆలోచన ఉండేది కాదు. కుచేలుడి ప్రార్థనలో భగవంతుడే కనిపించాడు. భార్య సలహా మేరకు కృష్ణుణ్ణి కలిసినప్పుడు అసలు తానెందుకు వచ్చాడో కూడా మరిచిపోయాడు. అంతగా ఆయన స్నేహపు జల్లులో మైమరచిపోయాడు. కాబట్టి కృష్ణ కుచేలుర స్నేహమే గొప్పదని పండితులు అంటున్నారు.