Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి?

ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహి

అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
, శనివారం, 22 అక్టోబరు 2016 (15:26 IST)
ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది చాలా  అనిశ్చిత స్థితిని ఏర్పరిచింది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడచిన తర్వాత కూడా, చాలామందికి  అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం. ఈ  కారణంగానే వారి మనస్సులో ఎన్నో సందేహాలు.
 
ఆలోచన మానసికమైంది, అదెప్పుడూ ఆధ్యాత్మికత అవ్వదు. మనం మన మనస్సులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ణి గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత కాదు. ఆలోచన మానసికమైంది, అదెప్పుడూ ఆధ్యాత్మికత అవ్వదు.  ఇది ఎలాంటిదంటే, నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలుందనడం లాంటిదది. వేలు ఎప్పుడూ భౌతికమైనదే. అది కేవలం భౌతికం మాత్రమే కాగలదు. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. కానీ అంతమాత్రాన అవే ఆధ్యాత్మికం కాదు. అదొక మంచి భౌతికమైన చిటికెన వేలు మాత్రమే. అది అడ్డంక్కి లాగా ఐనా ఉండచ్చు లేదాఆవలికి ఓ ద్వారమైనా కావచ్చు . ఏదైనప్పటికీ, అది భౌతికం మాత్రమే.
 
భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. మనకీ భౌతిక శరీరం ఉంది కాబట్టే మరో కోణం గురించి ఆలోచించగలుగుతున్నాం. లేకపోతే ఆ అవకాశమే లేదు. మనం ఇక్కడ భౌతికంగా ఉండకపోతే ఆధ్యాత్మిక ప్రక్రియకు అవసరమే రాదు. అందువల్ల ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గమే కాని అదే ఆధ్యాత్మికత కాలేదు. అదేవిధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికత కాలేవు. అవి జీవితంలోని భిన్నకోణాలు, వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఒక ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా ఉపయోగించవచ్చు. అదే విధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా లేదా ఆధ్యాత్మిక సంభావ్యతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కాని బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.
 
మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఒక ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా ఉపయోగించవచ్చు. మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు భౌతికం కాని మరో కోణం గురించి మాట్లాడుతున్నాం, అది ఈ పరిధికి చెందింది కాదు. మనం మానసిక ప్రశాంతి కోసం చూస్తున్నట్లయితే అది ఆధ్యాత్మికత కాదు. జనం ఆధ్యాత్మిక ప్రశాంతి గురించి మాట్లాడుతుంటారు. అటువంటిదేదీ లేదు. శాంతి అన్నది భౌతికమైంది, మానసికమైంది. మీరు శారీరకమైన దాన్ని, మానసికమైన దాన్ని కలత పెట్టవచ్చు. ఈ రెండూ కాని ఆధ్యాత్మికాన్ని కలత పెట్టలేరు. అది శాంతిని కోరదు, దానికి శాంతి అవసరం కూడా లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేత భూతమైన శిరిడీ సాయిని పూజించడం మానెయ్యాలి... స్వరూపానంద సంచలనం