Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపం అంటే ఏమిటి? ఎన్ని రకాలుగా చేస్తారు... ఏంటి ప్రయోజనం?

భగవంతుడిని ఆరాధించే పలు విధానాల్లో చాలా ముఖ్యమైనది, అందరూ సులభంగా చేయగలిగినది జపం. ఏదో మొక్కుబడిగా కాకుండా, కాలక్షేపానికి కాకుండా ఓ నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబ

జపం అంటే ఏమిటి? ఎన్ని రకాలుగా చేస్తారు... ఏంటి ప్రయోజనం?
, శుక్రవారం, 19 మే 2017 (16:24 IST)
భగవంతుడిని ఆరాధించే పలు విధానాల్లో చాలా ముఖ్యమైనది, అందరూ సులభంగా చేయగలిగినది జపం. ఏదో మొక్కుబడిగా కాకుండా, కాలక్షేపానికి కాకుండా ఓ నియమం ప్రకారం జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ రోజుకు ఎన్నిసార్లు జపం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే నియమాలు చాలా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం-
 
వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్
వాచికము, ఉపాంశువు, మానసికము అనే మూడు విధానాల్లో జపం చేయవచ్చు. బయటకు వినిపించే విధంగా భగవంతుడిని స్మరిస్తే దాన్ని వాచికము అని, శబ్దాలేవీ బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ, నాలికతో చేసే జపాన్ని ఉపాంశువు అని అంటారు. నాలిక, పెదవులు రెండూ కదపకుండా, నిశ్చలంగా మౌనంగా మనస్సు లోపలే చేసే జపాన్ని మానసికము అంటారు.
 
హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జపం చరేత్
హృత్సమౌ తు కరౌ మధ్యే సాయం ముఖ సమౌ కరౌ
ప్రాతఃకాలంలో జపం చేసేటప్పుడు చేతులను నాభి వద్ద పెట్టుకుని, మధ్యాహ్నం వేళ జపం చేసేటప్పుడు హృదయము వద్ద పెట్టుకుని చేయాలి. సాయంత్రం జపం చేసేటప్పుడు చేతులను ముఖానికి సమాంతరంగా ఉంచుకోవాలి. అలాగే చందనపూసలు, అక్షతలు, పువ్వులు, ధాన్యం, మట్టిపూసలతో చేసిన జపమాలను ఉపయోగించరాదు. సింధూరపూసలు, దర్భ, ఎండిన ఆవుపేడ పూసలు, రుద్రాక్షలు, తులసి పూసలు లేదా స్ఫటిక పూసలతో చేసిన జపమాలు శ్రేష్టం అని పురాణాలు చెప్తున్నాయి. 
 
జపమాలలోని పూసలు ఖచ్చితంగా 108 ఉండేలా చూసుకోవాలి. జపమాల యొక్క రెండు కొసలను కలిపే పూసను ‘సుమేరుపూస’ అంటారు. జపము చేసేటప్పుడు జపమాల కనిపించకుండా పైన ఒక పొడి వస్త్రాన్ని కప్పాలి. జపమాలను ఉంగరపు వ్రేలు పై నుండి చూపుడువ్రేలిని ఉపయోగించకుండా బొటనవ్రేలితో పూసలను లెక్కించాలి. సుమేరుపూసను దాటి ముందుకు పోకుండా మాలను వెనుకకు త్రిప్పి జపము చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డు స్థాయిలో శబరిమల అయ్యప్పస్వామి ఆదాయం... ఎంతో తెలుసా..?