Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవాలయంలో పాటించాల్సిన నియమాలు... తులసిని తుంచరాదు... ఇంకా మరిన్ని...

తీర్థము తీసుకొనునపుడు ౩ సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకే కాలమున తీసుకొనరాదు. ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను (దీపారాధన) వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉ

దేవాలయంలో పాటించాల్సిన నియమాలు... తులసిని తుంచరాదు... ఇంకా మరిన్ని...
, శనివారం, 13 ఆగస్టు 2016 (19:25 IST)
తీర్థము తీసుకొనునపుడు ౩ సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకే కాలమున తీసుకొనరాదు. ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను (దీపారాధన) వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి. శివునికి అభిషేకం, సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం, అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది. 
 
దైవ ప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు. దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. దేవుని పూజకు ఉపయోగించు ఆసనం వేరొక పనికి వాడరాదు. దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. 
 
పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి, నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి. యుద్ధమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని, విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు, హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. 
 
లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫోటోగాని, విగ్రహంగాని ఉండాలి. నిలబడి ఉన్నది వాడరాదు. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు. ఉదయం, సాయంకాలం రెండుసార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోవాలి. తులసి దళములను పూజ చేయునపుడు దళములుగానే వెయ్యాలి. ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి, ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్క‌ర యాత్రికుల‌తో ఏర్పాట్ల‌పై సీఎం చంద్ర‌బాబు స‌ర్వే!