తితిదే ఉన్నతాధికారుల మధ్య బయటపడిన అంతర్గతపోరు..
						
		
						
				
ఒకరేమో తితిదే ఈఓ.. మరొరకరేమో తితిదే జెఈఓ.. ఇద్దరూ తితిదే ముఖ్యులే. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తితిదే పాలనను ఈఓ చూస్తుంటే.. జెఈఓ శ్రీనివాసరాజు మాత్రం సేవా టిక్కెట్లను విఐప
			
		          
	  
	
		
										
								
																	ఒకరేమో తితిదే ఈఓ.. మరొరకరేమో తితిదే జెఈఓ.. ఇద్దరూ తితిదే ముఖ్యులే. అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తితిదే పాలనను ఈఓ చూస్తుంటే.. జెఈఓ శ్రీనివాసరాజు మాత్రం సేవా టిక్కెట్లను విఐపిలకు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటుంటారు. గత ఆరుసంవత్సరాలైనా తిరుమల జెఈఓ మాత్రం అదే పదవిలో ఇప్పటికీ ఉన్నారన్న విషయం ఎప్పటి నుంచో చర్చనీయాంశంగానే ఉంది.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	అయితే వీరిద్దరి మధ్య అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీనివాసరాజు ఇష్టమొచ్చినట్లు విఐపిలకు సేవాటిక్కట్లు ఇచ్చేశారన్న విమర్సలపై తితిదే ఈఓ వివరణ అడిగే ప్రయత్నం చేశారు. తనకు తెలియకుండా ఇన్ని టిక్కెట్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈఓ. జెఈఓ శ్రీనివాసరాజు మాత్రం ఈఓ అడిగిన ప్రశ్నలకు అన్నింటికి ఏదో ఒక సమాధానం చెబుతూ వచ్చారు. దీంతో వీరి మధ్య మరోసారి అంతర్గత పోరు బయటపడింది.
 
									
										
								
																	
	 
	సమాధానం కూడా సరిగ్గా చెప్పకుండా జెఈఓ వెళ్ళిపోవడంతో ఈఓ ఆగ్రహంతో వూగిపోయారు. ఈఓ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీనటుడు మోహన్‌బాబుతో పాటు చాలామంది ప్రముఖులు తితిదే తీరుపై అసహనం వ్యక్తం చేసిన నేపథ్యలో ఆ  విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈఓ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద వీరి అంతర్గత పోరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.