శుక్రగ్రహ దోషాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవిని పూజిస్తే?

జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అవసరమెుచ్చినా అప్పటికది పెద్దదిగానే, ముఖ్యమైనదిగానే కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారమవుతాయి. కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరుతాయి. అందువలన డబ్బుకి అధిక

గురువారం, 19 జులై 2018 (12:53 IST)
జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అవసరమెుచ్చినా అప్పటికది పెద్దదిగానే, ముఖ్యమైనదిగానే కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సమస్యలు డబ్బుతోనే పరిష్కారమవుతాయి. కొన్ని అవసరాలు డబ్బుతోనే తీరుతాయి. అందువలన డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇవ్వవడం జరుగుతుంది. అలాంటి ధనానికి ఇబ్బందిపడే పరిస్థితులు రాకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావలసి ఉంటుంది.
 
ఆ తల్లి కటాక్షం కావాలంటే అంకితభావంతో కూడిన పూజాభిషేకాలు చేయవలసి వస్తుంది. శుక్రవారం రోజున భక్తిశ్రద్ధలతో సేవించవలసి ఉంటుంది. అందువలన అమ్మవారు ప్రీతిచెందుతుందనే ఫలితంగా దారిద్ర్యం తొలగిపోయి సంపదలు ప్రసాధించబడుతాయని చెప్పబడుతోంది. అమ్మవారిని అర్చించడం వలన శుక్రగ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
 
శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అర్చించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు, పూజాభిషేకాలు చేయడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కలలో గాజులు కనిపిస్తే... ఏం జరుగుతుందో తెలుసా?