Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి సన్నిధిలో అడ్డగోలుగా వ్యాపారం...

రహస్యం లేని సమాజం కోసం ప్రజలు ముందుకు పోవాలని చట్టసభల్లో తీర్మానాలు చెబుతున్న ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు లేకపోలేదు.

శ్రీవారి సన్నిధిలో అడ్డగోలుగా వ్యాపారం...
, గురువారం, 5 జనవరి 2017 (14:36 IST)
రహస్యం లేని సమాజం కోసం ప్రజలు ముందుకు పోవాలని చట్టసభల్లో తీర్మానాలు చెబుతున్న ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు లేకపోలేదు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మహత్తర పథకాలతో ముందుకు సాగుతున్న తితిదే యాజమాన్యంలో దిగువ స్థాయి సిబ్బంది పనితీరుతో సంస్థ పేరు, ప్రఖ్యాతలను మసకబారేలా చేస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం కేటాయిస్తున్న విఐపి దర్శనాలను మూడు విభాగాలుగా విభజించారు.
 
అందులో లిస్టు 1కి మాత్రం ప్రోటోకాల్‌ పరిమితి ఉంటుంది. లిస్టు-1లో దర్శించుకునే ముఖ్య అతిథులకు తితిదే ఉన్నతాధికారి అయిన జెఈఓ ఆధ్వర్యంలో జరుగుతాయి. అందులోభాగంగా ముఖ్యులకు స్వామివారి సన్నిధిలో ప్రసాదాలుగా జీడిపప్పు, ద్రాక్ష, అరటిపండ్లను అందిస్తారు. లిస్టు-1 దర్శన విఐపిలకి ప్రోటోకాల్‌ పాటించి వారికి అటెండర్‌ను కేటాయిస్తోంది. ఛైర్మన్‌, బోర్డు సభ్యుల సిఫార్సులతో లిస్టు-1 దర్శనంతో అర్హులు ఎక్కువై ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని భక్తులు చెబుతున్నారు.
 
ఆలయ అధికారులు ప్రోటోకాల్‌ పద్దతిలో నిబంధనలు పాటించకపోవడంతో భక్తుల్లో అసంతృప్తి నెలకొంది. లిస్టు 1 దర్శనం అనంతరం లిస్టు 2 దర్శనం ప్రారంభమవుతోంది. ఆలయ నిబంధనలకి విరుద్ధంగా ప్రోటోకాల్‌ అటెండర్లు వారి వ్యాపార లావాదేవీల్లో భాగంగా వారికి కావాల్సిన భక్తులను తీసుకువచ్చి స్వామివారి ముందు వారి తృప్తి మేరకు నిలబెట్టి దర్శనం చేయిస్తున్నారు. దర్శనానికి వస్తున్న ప్రతి విజిలెన్స్ అధికారికి ఒక్కో హోంగార్డును ప్రోటోకాల్‌ విధులకి ఉపయోగించుకుంటూ తితిదేని వారి వ్యాపార సంస్థగా మార్చుకుంటున్నారని ఆలయ సిబ్బందే ఆరోపిస్తున్నారు.
 
విఐపి దర్శనాల పరిమితిని 3 వేల నుంచి 2,500 మంది విఐపిలు దర్శించుకుంటున్నారు. శ్రీవారి సన్నిధిలో జరుగుతున్న అక్రమాలను జయ-విజయల వద్ద ఉన్న సిసి ఫూటేజీలు పరిశీలించాలని అంటున్నారు. లిస్టు-2లో ప్రోటోకాల్‌, ఇతరత్రా దర్శించుకుంటున్న భక్తులు వరుసలో ముందుగా వెళ్ళినవారు వరుస క్రమంలో ఎవరు ముందుగా వస్తున్నారు. ఎవరు అక్కడ నిల్చున్నారు. వారిని ఎవరు నిలబెట్టారన్నది పరిశీలించి సామాన్య భక్తులకు, సిబ్బందికి వారి సమూహక భక్తులకు రాచ మర్యాదలతో స్వామివారి దర్శన ఏర్పాట్లకు తితిదే సిబ్బంది సహకరిస్తారు. 
 
అలా సహకరించని పక్షాన వారిపై ఏదో ఒక నిరారోపణలు చెబుతున్నారు. రోజూ వారి దర్శనంలో ప్రోటోకాల్‌ పేరిట సుమారు 100 మంది సిబ్బంది అవసరమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రోటోకాల్‌ అటెండర్లు, హోంగార్డులు అక్కడ ఇంతా అంతా హవా కాదు. తితిదే ఉన్నతాధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యప్ప స్వామి వాహనం చిరుతపులి ఎవరో తెలుసా? అయ్యప్ప వృత్తాంతం...