Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదవి కోసం ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు జెఈఓ వంతు..!

తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవులు అలంకరించాలంటే ఎంతోమంది ముందుంటారు. అలాంటి పదవిని ఒక్కసారి వస్తే ఇక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి పనే ప్రస్తుతం చేస్తున్నారు తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు

పదవి కోసం ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు జెఈఓ వంతు..!
, శుక్రవారం, 6 జనవరి 2017 (14:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవులు అలంకరించాలంటే ఎంతోమంది ముందుంటారు. అలాంటి పదవిని ఒక్కసారి వస్తే ఇక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి పనే ప్రస్తుతం చేస్తున్నారు తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం తిరుమల జెఈఓగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరాజు ఆ తర్వాత ఆ పదవినే పట్టుకునే కూర్చున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కాంగ్రెస్‌ హయాంలో వచ్చిన శ్రీనివాసరాజు సిఎంలు మారినా ఆ పదవిలో మాత్రం ఆయనే ఉన్నారు. కారణం ఏమిటో ఇప్పటికీ ఎవరికి అర్థం కాని ప్రశ్న అది. అయితే కొంతమంది మాత్రం ఏ చెట్టుకు ఆ గొడుగు పట్టడంలో శ్రీనివాసరాజును మించిన వ్యక్తి మరొకరు ఉండదరన్నది.
 
మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి ఆశీస్సులతో తిరుమల జెఈఓగా బాధ్యతలు స్వీకరించారు శ్రీనివాసరాజు. స్వతహాగా శ్రీనివాసరాజుది చిత్తూరు జిల్లానే. పుట్టింది ఇక్కడైనా, పెరిగిందంతా హైటెక్‌ సిటీ హైదరాబాద్‌లోనే. తనకు ఉన్న పరిచయాలతో ఎలాగోలా జెఈఓ అయిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా అలాగే కొనసాగుతూ వస్తున్నారు. సాధారణంగా తితిదేలో రెండు సంవత్సరాలకు మించి ఎవరినీ ఉంచరు. అందులోను ప్రభుత్వం అసలు ఉంచదు. 
 
ఎట్టి పరిస్థితుల్లోను కీలక పదవుల్లో ఉన్న వారిని మెల్లగా పక్కన పంపుతూ వస్తుంది. అది కూడా అలా ఇలా కాదు.. సంబంధమే లేని ప్రాంతంలో తీసుకెళ్ళి పడేస్తుంది ప్రభుత్వం. ఇదే పరిస్థితిని గతంలో ధర్మారెడ్డి అనే వ్యక్తి ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో ఒక్క వెలుగు వెలిగిన ఆయన ఆ తరువాత మున్సిపల్‌ కమిషనర్‌ అయిపోయారు. తిరుమల జెఈఓ పదవెక్కడ మున్సిపల్‌ కమిషనర్‌ పదవి ఎక్కడ. అప్పట్లో ఆయనపై వచ్చిన ఆరోపణలే ఆయన్ను అంత దూరం పంపిందన్న ఆరోపణలు లేకపోలేదు.
 
ఇదెలా ఉన్న ప్రస్తుతం ఉన్న జెఈఓను మాత్రం వైకుంఠ ఏకాదశి తర్వాత బదిలీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు చంద్రబాబు. కారణం స్థానిక తెదేపా నేతలే. ఒకవైపు ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి ఉన్నా సేవా టిక్కెట్లు ఇవ్వకపోవడం, మరో వైపు తమ లెటర్‌ హెడ్‌లను వాడుకుని జెఈఓ కార్యాలయంలో సేవాటిక్కెట్ల కోసం ధరఖాస్తు చేసుకున్నా వారు ఇవ్వకపోవడం చూస్తుంటే మొత్తం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో చేసేది లేదు పంచాయతీ బాబు ముందుంచారు. ఇన్ని రోజులుగా చంద్రబాబు కుమారుడు నారాలోకేష్‌తో అన్నీ చక్కదిద్దుకుంటూ వచ్చిన జెఈఓ శ్రీనివాసరాజుకు ప్రస్తుతం పరిస్థితి కత్తిమీద సాములా మారింది.
 
చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తరువాత నారాలోకేష్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక జెఈఓ శ్రీనివాసరాజు నారాలోకేష్‌ను వదిలి బాబు జపం పట్టాడు. గత మూడు రోజుల నుంచి ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌లో బిజీగా ఉన్న చంద్రబాబు చుట్టూ చక్కర్ల కొట్టడం ప్రారంభించాడు శ్రీనివాసరాజు. అంతే కాదు బాబుకు అత్యంత సన్నిహితుల చేత చెప్పించడం ప్రారంభించాడు. తన ప్రయత్నంతో పాటు వాళ్ళు చేసే రెకమెండేషన్‌ తన పదవిని కాపాడుతుందన్న నమ్మకంతో ఉన్నారు శ్రీనివాసరాజు. మొత్తం మీద శ్రీనివాసరాజు బాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చిన ప్రముఖులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్లగూబ ఇంటి వాకిలి ముందు వాలితే ఏం జరుగుతుంది?