Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త జంటకు శ్రీవారి ఆశీస్సుల కావాలా? అయితే ఈ నంబరుకు ఫోన్ చేయండి

మాంగల్యధారణం అంటే.. "నా జీవనానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నారు. నీవు నిండు నూరేళ్ళు జీవించు" అని అర్థం. హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. యువతీ యువకు

Advertiesment
కొత్త జంటకు శ్రీవారి ఆశీస్సుల కావాలా? అయితే ఈ నంబరుకు ఫోన్ చేయండి
, సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (10:56 IST)
మాంగల్యధారణం అంటే.. "నా జీవనానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నారు. నీవు నిండు నూరేళ్ళు జీవించు" అని అర్థం. హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. యువతీ యువకులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి జగ్రదక్షకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఇందుకు చేయాల్సింది ఒక్కటే. పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపితే చాలు.
 
నవ సమాజంలో గృహస్థ ధర్మం కీలకమైనది. వధూవరుల కళ్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉప ద్రవాల నుంచి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధులు ఎడమచేతికి ధరింపజేస్తారు. ఇందుకోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణధారణకు కంకణం పంపుతారు. 
 
వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని, సత్కర్మలు పెంపొందించాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలని, సిరి సంపదలు కలగాలని తితిదేని కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది.
 
గృహస్థ జీవితం కోరుకునే స్త్రీ పురుషులకు అన్యోన్యం, అనురాగబంధంతో ముడివేసే వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య రచించిన కళ్యాణ సంస్కృతి పేరిట ఓ పుస్తకాన్ని తితిదే కార్యనిర్వహణాధికారి పేరిట వేద ఆశీర్వచన పత్రికను నవ వధూవరులకు పంపుతారు.
 
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల శుద్ద ప్రతి (తపాలా విభాగం) విభాగం సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ ప్రతి సంవత్సరం పది వేలకుపైగా నూతన జంటలకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తున్నారు.
 
ఎలా పొందాలంటే.. శ్రీవారి ఆశీస్సులు పొందగలోరు నూతన వధూవరులు కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు. తిరుపతి - 517501 పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంబర్ నెం.0877-2233333, 2277777 సంప్రదించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షరాభ్యాసం - అంతరార్థం తెలుసా.. ఓనమాలు దిద్దించటం అంటే ఏమిటి..?