500 యేళ్ళ కిందటే శ్రీవారి ఆలయంలో 29 రకాల ఉద్యోగులున్నారట!
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు 9,500 మంది రెగ్యులర్ ఉద్యోగులు. 13,500 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఇక పరోక్షంగా కొన్ని వేలమంది శ్రీనివాసుని నమ్ముకుని జీవనం సాగి
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు 9,500 మంది రెగ్యులర్ ఉద్యోగులు. 13,500 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఇక పరోక్షంగా కొన్ని వేలమంది శ్రీనివాసుని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 500 యేళ్లకు మునుపే స్వామివారి ఆలయంలో 29 రకాల ఉద్యోగులు పనిచేసేవారట. ఆ వివరాలు శాసనాల్లో లభ్యమయ్యాయట.
15వ శతాబ్దంలో 29 రకాల ఉద్యోగులు శ్రీవారి ఆలయంలో పనిచేసేవారు. ఇప్పటిలాగా నెలకోసారి వేతనాలు ఇచ్చే వారు కాదు. వివిధ ఉత్సవాల సందర్భంగా స్వామివారి ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లించేవారట. ఈ ఉద్యోగుల్లో దేవస్థానం స్థానాత్తరులు, దేవాలయ అధికారులు, కాపలాదారులు, బంగారు పనిచేసే కంసాలీలు, కొలిమి పనిచేసేవారు, దేవాలయానికి కట్టెలు తీసుకుని వచ్చేవారు, తాపీ పనిచేసేవారు, ఊడిగందారులు, మేళం వాయిద్యగాళ్లు, ఏనుగు మావటీలు, దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్లు. మొత్తం 29 రకాల ఉద్యోగులు ఉండేవారు.
ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలకమండలి ఉన్నట్లే 15వ శతాబ్దకాలంలో తిరుమల, తిరుపతిలోని ఆలయాల వ్యవహారాలను చూడడానికి ఒక కమిటీ ఉండేది. దీన్ని స్థానాత్తరు అని పిలిచేవారు. ఈ కమిటీలో 12 మంది సభ్యులుండేవారు. ఒక శాసనంలో లభించిన వివరాల ప్రకారం 12మంది స్థానాత్తరుల్లో తిరుపతి శ్రీ వైష్ణవులు-4, నంబియార్ (శ్రీవాఇ ఆలయ అర్చకుడు)-1, నంబియార్ తిరుచానూరు-1, కోయిల్ కెల్వి జియ్యర్ (పెద్దజియ్యర్, చిన్నజియ్యర్) -2, కోయిల్ కానుక్కు తిరునిన్వస్థయు - ఉడైయార్ -2 సభ్యులు ఉండేవారు. ఈ సభ్యులు ఆలయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేవారు.
సాళువ రాజుల కాలంలో తిరుమలలో ఏడాదికి ఏడు పర్యాయాలు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు జరిగేవట. ఈ ఉత్సవాల్లో చివరిరోజైన 9వ రోజు అప్పటిదాకా భక్తుల నుంచి వసూలైన విరాళాలు, కానుకల వివరాలను కొలువుదీరిన ఉత్సవార్ల ఎదుట, భక్తుల సమక్షంలోనే ఆముదపడి వాసలిలో చదివి వినిపించేవారట. ఈ కొలువు ఉగ్రాణం వద్ద జరిగేదని శాసనాలు చెబుతున్నాయి. స్వామివారికి లభిస్తున్న ఆదాయ వివరాలు పారదర్శకంగా ఉండటం కోసం ఇలాంటి ఏర్పాటు చేశారని భావించాలి. ఏమైనా అప్పట్లోనే అంత మంచి విధానం రూపొందించినందుకు అభినందించాలి.