Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మోత్సవాలు-2016: హంస వాహనంపై ఊరేగే స్వామిని దర్శించుకుంటే కోపం తగ్గుతుందట..

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం అంకురార్పణ జరిగిపోయింది. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడు ముల్లోకాల్లో విహరించి, బ్రహ్మోత్సవాల్లో ప

బ్రహ్మోత్సవాలు-2016: హంస వాహనంపై ఊరేగే స్వామిని దర్శించుకుంటే కోపం తగ్గుతుందట..
, సోమవారం, 3 అక్టోబరు 2016 (15:56 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం అంకురార్పణ జరిగిపోయింది. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడు ముల్లోకాల్లో విహరించి, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని దేవతలను ఆహ్వానించాడు. సోమవారం  ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు జరిగి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో  ఏ వాహన సేవలో పాల్గొంటే ఉత్తమం. ఏ వాహన సేవను దర్శించుకుంటే ఎలాంటి ఫలితం దక్కుతుందని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
 
తొలిరోజున జరిగే పెద శేష వాహనంపై విహరించే శ్రీవారిని దర్శించుకుంటే... సర్పభయాలు తొలగిపోతాయి. కాలసర్పదోషం నివృత్తి అవుతుంది. పరమపథం సిద్ధిస్తుందని తితిదే పండితులు అంటున్నారు. అలాగే చిన శేష వాహనంపై విహరించే మలయప్ప స్వామిని భక్తులు దర్శించుకోవడం ద్వారా యోగసిద్ధి ఫలం కలుగుతుంది. హంసవాహనంపై ఊరేగే స్వామివారిని దర్శించకుంటే  విచక్షణా జ్ఞానం పెరుగుతుంది. కోపం తగ్గుతుంది. 
 
మోహినీ అవతారంలోని స్వామిని దర్శనం ద్వారా బాంధవ్యాల కంటే విలువైనదని మరేదీ ఉండదనే సత్యాన్ని ఉద్భోధిస్తుంది. ఇక సింహ వాహన సేవను వీక్షిస్తే.. మృగభయం వీడుతుంది. గజ వాహనంపై ఉన్న దేవుని సేవిస్తే, మహాలక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఇక అశ్వ వాహన సేవలో పాల్గొంటే దుర్గుణాలు మటాష్ అవుతాయి. సద్గుణాలు ఆవహిస్తాయి. స్వర్ణరథంలో ఉభయదేవేరులతో కలసి భక్తులకు కనువిందు చేసే స్వామిని చూస్తే, పునర్జన్మంటూ ఉండదని పండితులు చెప్తున్నారు. కల్పవృక్ష వాహన సేవను కనులారా దర్శిస్తే, కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఇక సూర్య ప్రభ వాహనంలో తిరిగే మలయప్ప స్వామిని వీక్షిస్తే, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. 
 
హనుమంత వాహన సేవలో పాల్గొంటే, ఈతిబాధలు సులభంగా తొలగిపోతాయి. స్వామి కృప మీ వెంటే ఉంటుంది. ఇక స్వామి వారి సేవల్లో కీలకమైన గరుడ వాహన సేవ ద్వారా సంతాన ప్రాప్తి, దివ్యమైన జ్ఞానం కలుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సప్తగిరులపై బ్రహ్మోత్సవం శోభ - బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ