వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి తిరుమల ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది.
అర్చకులు నిర్వహించిన కైంకర్యాలు పూర్తయ్యాక 12.5 గంటలకు దర్శనాలు ప్రారంభం అయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు.
ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో, ఆఫ్ లైన్‌లో టోకెట్లు పొందారు. ఈ నెల 11వ తేదీ వరకు భక్తులను శ్రీవారి వైకుంఠం ద్వార దర్శనానికి అనుమతి ఇస్తారు. ముందుగా వీవీఐపీ, వీఐపీ దర్శనం తర్వాత ఉదయం 5 గంటల నుంచి సామాన్యు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.