Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారి పుష్పాలు ప్రైవేటు పెళ్ళిళ్ళకు..?

తిరుమల శ్రీవారికి అత్యంత భక్తి శ్రద్థలతో దేశ విదేశాల నుంచి భక్తులు సమర్పించే స్వామి వారి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాలు తిరుమల కొండకు చేరక మునుపే దొడ్డిదారిన పెళ్ళి మండపాలకు చేరుతున్నాయి. పేరుగాంచిన టిటిడి ఉద్యానవన శాఖలో గత కొంతకాలంగా నమ్మకంగా జరుగుత

Advertiesment
tirumala news
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (13:20 IST)
తిరుమల శ్రీవారికి అత్యంత భక్తి శ్రద్థలతో దేశ విదేశాల నుంచి భక్తులు సమర్పించే స్వామి వారి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాలు తిరుమల కొండకు చేరక మునుపే దొడ్డిదారిన పెళ్ళి మండపాలకు చేరుతున్నాయి. పేరుగాంచిన టిటిడి ఉద్యానవన శాఖలో గత కొంతకాలంగా నమ్మకంగా జరుగుతున్న అక్రమం తిరుపతిలో ప్రైవేటు పెళ్ళిళ్లలో బహిర్గతమైంది.
 
నమ్మకమైన వ్యక్తులుగా ఉన్నతాధికారుల కనుసన్నలలో వారికి అనుయాయులుగా వెలుగుతోన్న వారు చేస్తున్న పుష్పాల అక్రమ మళ్ళింపులు టిటిడిలో కాదేదీ అక్రమాలకు అనర్హంగా తెలుస్తోంది. భక్తులు అత్యంత పవిత్రంగా అమిత భక్తి శ్రద్థలతో నేరుగా స్వామివారికి చేరుతాయి. శాస్త్రాల ప్రకారం తిరుమల వెంకన్న పుష్పప్రియుడు అని నమ్మకం. పుష్పాల విరాళాలు ఉచిత సరఫరా అనాది నుంచి జరుగుతున్నదే. ఆలయం లోపల పూలబావి ఆలయ ఆర్కిటెక్స్ లోనే ఒక భాగంగా ఉందంటేనే శ్రీవారి ఆలయ నిర్వహణలో పుష్పాల పాత్ర ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమైపోతుంది. 
 
ఈ క్రమంలో పెద్ద డోనార్లు తాజా పూలను సేకరించి కొనుగోలు చేసి తిరుపతికి చేరవేస్తారు. ఈ డోనార్ల లిస్టులో సినీనటుడు రజనీకాంత్‌, అపోలో ఆసుపత్రి డైరెక్టర్‌ ఉపాసన, రాక్‌లైన్‌ వెంకటేష్‌లు ఎందరో రెగ్యులర్‌ డోనార్లు వారంలో రోజుకు ఒకరు చొప్పున పూలు పంపిస్తారు. ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి పూలు తెప్పించి మరీ డోనార్లు తిరుమలకు చేరుస్తున్నారు. ఈ వ్యవహారంలో మొదట నుంచి పనిచేస్తున్న కొందరు గార్డినర్లు పుష్పాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వారిని చూస్తే వారు గార్డినర్లు అని ఎవరూ అనుకోరు. 
 
ఆఫీసులో జరిగే అంశాలపై తమకున్న అనుభవాన్ని జోడించి గార్డెన్‌ డిపార్టుమెంట్‌లో ఉండాల్సిన డోనార్ల వివరాలను ఫోన్‌ నెంబర్లను తమ వద్ద ఉంచుకుని కో-ఆర్డినేట్‌ చేస్తున్నామన్న పేరుతో డోనార్లతో సంబంధాలు పెట్టుకుంటారు. తిరుపతి జిల్లాలో ఏదైనా పెద్ద పెళ్లిల్ళు జరిగితే స్వామివారికి ఈ రోజు విశేష పూజ ఉంది. అందుకు పువ్వులు అవసరమని చెబుతూ పూలు పంపాల్సిందిగా డోనార్లకు వర్తమానం పంపి, తిరుపతి బైపాస్‌ రోడ్లలోను లేదా ఎసి వాహనాల్లో డోనర్లు పంపే పూలను తీసుకుని వాటిని తిరుమలకు చేర్చకుండా పెళ్ళి మండపాలకు తరలిస్తున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడే లేరు. 
 
ఈ విషయంలో సంబంధిత అధికారి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన సొంత పనులు చక్కబెడుతున్నందువల్ల ఆయన వారికి కొమ్ము కాస్తున్నారని ఆ ఉద్యోగులే అంటున్నారు. తిరుమలలో ఉన్న గార్డెన్‌ల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటే, టిటిడి ఈఓ ప్రస్తుత గార్డెన్‌ విభాగంపై ఎన్నో ఆశలు పెట్టుకుని వేలాడే ఉద్యానవనాలను పెంచాలని చూస్తున్నారు. వేలాడే ఉద్యానవనాల కన్నా శాశ్వత నిర్వహణకు పటిష్టమైన ప్రణాళిక గార్డెనర్ల ఎంపికతో పాటు సంబందిత పని అప్పగించాల్సిన అవసరం కూడా ఉందని గార్డెన్‌ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఈఓ సాంబశివరావు ఈ పూల వ్యాపారంపై సమగ్ర విచారణ జరిపిస్తే ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తామని ఉద్యోగులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుద్రాక్షలు ధరిస్తారు సరే... నియమాలు ఏమిటో తెలుసా...?