Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో 60 వేల లడ్డూలు ఏమయ్యాయి... బోగస్‌ పాస్‌ పుస్తకాల పేరుతో హాంఫట్

తిరుమలలో దాతల పేరుతో నకిలీ పాస్‌ పుస్తకాలు రూపొందించి, చెలామణిలో పెట్టిన ఉదంతం ఇప్పుడు వెల్లడైంది కానీ చాలా నెలల క్రితమే డోనార్‌ సెల్‌లో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. దాతలకు ఇవ్వాల్సిన 60వేలకుపైగా లడ్

తిరుమలలో 60 వేల లడ్డూలు ఏమయ్యాయి... బోగస్‌ పాస్‌ పుస్తకాల పేరుతో హాంఫట్
, సోమవారం, 24 అక్టోబరు 2016 (14:42 IST)
తిరుమలలో దాతల పేరుతో నకిలీ పాస్‌ పుస్తకాలు రూపొందించి, చెలామణిలో పెట్టిన ఉదంతం ఇప్పుడు వెల్లడైంది కానీ చాలా నెలల క్రితమే డోనార్‌ సెల్‌లో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. దాతలకు ఇవ్వాల్సిన 60వేలకుపైగా లడ్డూలను కింది స్థాయి ఉద్యోగి ఒకరు అక్రమంగా తరలించి అమ్ముకున్నారన్న వార్తలు వచ్చాయి. ఆ కేసులో ఒకరిని సస్పెండ్‌ చేశారు. అంతే ఆ కేసు అంతటితో ఆగిపోయింది. 
 
60 వేల లడ్డూలు తరలిపోతే ఇందుకు ఒక ఉద్యోగి మాత్రమే బాధ్యడవుతాడా.. పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమయ్యారు? వారిపైన చర్యలు ఏమైనా ఉన్నాయా? ఏమో తెలియదు. దాత పేరుతో జరుగుతున్న అక్రమాలకు లడ్డూలు, పాస్‌ పుస్తకాల వ్యవహారం అద్దంపడుతోంది. దాతలకు ఇవ్వాలంటూ ఒక కింది స్థాయి ఉద్యోగి 60 వేలకుపైగా లడ్డూలు అక్రమంగా అమ్ముకున్నాడంటే ఇందులో ఇన్నాళ్ళు ఎన్ని లొసుగులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తితిదేకి వేల మంది దాతలు ఉన్నారు. వీరి పేరుతో తిరుమలలో పనిచేసే పిఆర్ ఓ లు, దళారులు దందా కొనసాగిస్తూ వచ్చారు. వారికి తితిదే ఉద్యోగులు సహకరించారు. ఇక్కడ గదులు, లడ్డూలు తీసుకునే విషయం దాతలకే తెలియదు. 
 
ఇవన్నీ గమనించిన తర్వాత ఈఓ సాంబశివరావు డోనార్‌ సెల్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక అప్లికేషన్‌ రూపొందించారు. ఇప్పుడు దాతల ప్రమేయం లేకుండా పాస్‌ పుస్తకం ఉపయోగించే అవకాశం లేని విధంగా రూపొందించారు. దాతలే దర్శనం టిక్కెట్టు. అకామిడేషన్‌ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే విధంగా ఈ-పాస్‌ పుస్తకాలు ఇచ్చారు. నెలరోజులకు ముందు నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన ఈ వ్యవస్థ వల్ల అక్రమార్కుల ఆటకట్టించే అవకాశం ఏర్పడుతుంది. బోగస్‌ పాస్‌ పుస్తకాలను అరికట్టడానికి వీలమైంది. ఇవన్నీ డోనార్‌ సెల్‌ను పటిష్టం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే 60 వేల లడ్డూల కుంభకోణం కేసులాగా ఉపయోగపడతాయి. అయితే 60 వేల డ్డూల కుంభకోణం కేసులాగా హడావిడి చేసి తూతూమంత్రంగా విచారణ చేసి వదలకుండా బోగస్‌ పాస్‌ పుస్తకాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని. అప్పుడే తితిదే అక్రమాలకు చెక్‌ పెట్టడానికి వీలవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీధి పోట్లు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి... తెలుసా...?