Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ ఇంటి గడపను తొక్కుతున్నారా.. ఇక అంతే...!

గడప దగ్గర ఇలా మాత్రం అస్సలు చెయ్యరాదు.. చేస్తే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్టే... ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిది కాదని ఇంట్లో మన పెద్దలు నిత్యం చెబుతుంటారు. అలా కూర్చుంటే అరిష్టం, దారిద్య్రం అని

మీ ఇంటి గడపను తొక్కుతున్నారా.. ఇక అంతే...!
, గురువారం, 23 మార్చి 2017 (12:00 IST)
గడప దగ్గర ఇలా మాత్రం అస్సలు చెయ్యరాదు.. చేస్తే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్టే... ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిది కాదని ఇంట్లో మన పెద్దలు నిత్యం చెబుతుంటారు. అలా కూర్చుంటే అరిష్టం, దారిద్య్రం అని హెచ్చరిస్తుంటారు. ఇంతకూ అది నిజమా? మూఢ నమ్మకమా? చాలా మందికి ఈ విషయం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది.

అయితే మన పెద్దలు అలా ఎందుకు అనేవాళ్లంటే.. కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు ఇంటిలోకి వచ్చి వెళ్తూంటాయి. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురును, ఇంటిలోపల గల నెగటివ్‌ ఎనర్జీ బయటికి తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా కూడా మంచిది కాదు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదు.
 
ఇక ఆధ్యాత్మికపరంగా చూసుకుంటే.. గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దిగువనున్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు. అలా కూర్చుంటే ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్నట్టేనని శాస్త్రాలు అంటున్నాయి. అంతేగాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు.. ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి, నవరత్నాలు, పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వార గడప కింద ఉంచడం ఆనవాయితీ. 
 
అందుకే ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా, లక్ష్మీదేవిగా పూజిస్తాం. కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారం (గడప)పై కూర్చోవడం.. లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది. అందుకే మన పూర్వికులు గడప పైన కూర్చోవడమే కాదు తొక్కడం, ఎక్కి నిల్చోవటాని కూడా వద్దని చెప్పేవాళ్ళు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిబాబాకు గురువారం పూట స్వీట్స్ నైవేధ్యంగా సమర్పిస్తే..?