Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి వాడు స్త్రీలకు వశుడవుతాడు: లంకలో సీతాదేవితో రావణుడు

అలాంటి వాడు స్త్రీలకు వశుడవుతాడు: లంకలో సీతాదేవితో రావణుడు
, గురువారం, 10 మార్చి 2022 (22:46 IST)
ఓరి అధముడా... పురుష శ్రేష్టులైన రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో నన్ను దొంగతనముగా తీసుకొచ్చావు. పురుష వ్యాఘ్రములైన రామలక్ష్మణుల ఎదుట నిలబడి వారి శరీర గంధమును సైతం పీల్చలేని హీన జాతి శునకానికి నువ్వు. ఏక బాహువైన వృత్రాసురుని ఇంద్రుడు తన రెండు బాహువుల చేత జయించినట్లు, రామలక్ష్మణలిరువురూ నిన్ను జయిస్తారు.

 
నీకు వారి చేతుల్లో బలవంతపు మరణం తప్పదు. ఇందుకు సందేహం లేదు. కాలవశాత్తూ ఎండిన చెట్టు మీద పిడుగు పడినచో, అది ఆ చెట్టును సమూలముగా ఎలా నశింపచేయునో, అదేవిధంగా శ్రీరాముడు నిన్ను సమూలంగా నాశనం చేస్తాడు. నీవు ఎన్ని లోకములలో దాగియున్ననూ వెలికి లాగి నీ ప్రాణాలు తీస్తాడు అని అన్నది.

 
సీతాదేవి చెప్పిన పరుష మాటలు విన్నాడు రావణుడు. ప్రజలందరికీ తన దర్శనముతో మనసుకు సంతోషం కలిగించు సీతకు అప్రియమైన కఠినోక్తులతో సమాధానమిచ్చాడు.

 
ఓ సీతా.. స్త్రీలను ఎక్కువగా శాంత వచనములతో ప్రార్థించువాడు స్త్రీలకు వశుడవుతాడు. స్త్రీలకు ఎక్కువగా ప్రియ వాక్యములు చెప్పి బ్రతిమాలువారిని స్త్రీలు తిరస్కరిస్తారు. నీ యందు నాకు విశేషమైన కామేచ్ఛ వుండటం వల్ల, సమర్థుడయిన సారథి పక్కదారి పడుతున్న గుర్రములను అదుపుచేయునట్లు, నేను నా క్రోధమును అణచుకుంటున్నాను.

 
సాధారణంగా, జనులకు ఎవరి యందు మోహము కలుగునో, వారి యందు దయాదాక్షిణ్యాదులు కూడా కలుగును. కనుకనే, రాజునైన నన్ను అంగీకరింపక, ఆ వనవాసి యందు ఆశతో నన్ను ఎన్ని విధముల అవమానించినప్పటికినీ, నీ యందు ప్రేమ, దయ కలుగుచున్నాయి. నిజానికి నీవాడిన మాటలకు నిన్ను వధించాలి. కానీ నాకు అనురాగమే కలుగుచున్నది అన్నాడు రావణుడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులకు అలెర్టు.. ఆ రోజుల్లో శ్రీవారి అర్జిత సేవలు రద్దు