Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాళహస్తికి రాజసం వచ్చింది...

వాయులింగక్షేత్రానికి రాజసం వచ్చింది. అతిపెద్ద రాజగోపుర నిర్మాణంతో శ్రీకాళహస్తికి మళ్ళీ పునర్ వైభవం వచ్చినట్లయింది. ఆరుసంవత్సరాల పాటు కష్టపడి నిర్మించిన రాజగోపురాన్ని చూస్తున్న భక్తులు ముక్కంటీశా అంటూ తన్మయత్వంలో మునిగిపోతున్నారు. చిత్తూరుజిల్లా శ్రీక

శ్రీకాళహస్తికి రాజసం వచ్చింది...
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (18:59 IST)
వాయులింగక్షేత్రానికి రాజసం వచ్చింది. అతిపెద్ద రాజగోపుర నిర్మాణంతో శ్రీకాళహస్తికి మళ్ళీ పునర్ వైభవం వచ్చినట్లయింది. ఆరుసంవత్సరాల పాటు కష్టపడి నిర్మించిన రాజగోపురాన్ని చూస్తున్న భక్తులు ముక్కంటీశా అంటూ తన్మయత్వంలో మునిగిపోతున్నారు. చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి ఆలయ రాజగోపురంపై ప్రత్యేక కథనం.
 
ఆంధ్రభోజుడు శ్రీక్రిష్ణదేవరాయలు ఎంతో భక్తితో శ్రీకాళహస్తి ఆలయానికి ముందు రాజగోపురాన్ని 1500సంవత్సరాల క్రితం నిర్మించారు. ఎంతో పురాతనమైన కట్టడమిది. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే తప్ప శ్రీక్రిష్ణదేవరాయల కాలం నాటి రాజగోపురాన్ని నిర్మించడం అసాధ్యం. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం 2010 మే 26వతేదీన శ్రీక్రిష్ణ దేవరాయలు నిర్మించిన రాజగోపురం ఒక్కసారిగా కూలిపోయింది. 
 
అయితే పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. కారణం గోపురం కూలిపోయే సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ తరువాత రాజగోపురాన్ని నిర్మించడానికి తీవ్రంగా ప్రయత్నించింది ప్రభుత్వం. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యపై ఒత్తిడి తీసుకువచ్చి రాజగోపురం నిర్మాణానికి శంఖుస్థాపన చేయించారు. ఆ తరువాత ఆరు సంవత్సరాల పాటు నవయుగ అనే కంపెనీ ఆరు సంవత్సరాల పాటు శ్రమపడింది.
 
పాత గోపురం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నిర్మించింది. ఎంతో గట్టి పునాదులతో నిర్మితమైన ఈ రాజగోపుర నిర్మాణం చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు. పాత రాజగోపురం లాగానే ఈ గోపురం నిర్మితం కావడం భక్తులను ఆధ్మాత్మిక చింతనలోకి తీసుకెళుతోంది. 47కోట్ల రూపాయలతో 145అడుగుల ఎత్తులో రాజగోపుర నిర్మాణం జరిగింది. వారంరోజుల పాటు రాజగోపుర ప్రారంభోత్సవం కోసం విశ్వశాంతి యజ్ఞాన్ని చేసిన శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు ఆ తరువాత ఫిబ్రవరి 2వతేదీన వైభవోపేతంగా మహాకుంభాభిషేకాన్ని పూర్తి చేశారు. మహాకుంభాభిషేకం అంటేనే ప్రారంభోత్సవం. కలశాలకు అభిషేకాలు చేసి గోపురాన్ని ప్రారంభించడం. కంచి మఠానికి చెందిన విజయేంద్ర సరస్వతి, పలువురు రాజకీయ నాయకులు రాజగోపుర మహాకుంభాభిషేకానికి హాజరయ్యారు. 
 
వైభవోపేతంగా జరిగిన రాజగోపుర కుంభాభిషేకానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. శ్రీకాళహస్తి అంటేనే మొదటగా భక్తులకు గుర్తొచ్చేది రాజగోపురం. అలాంటి రాజగోపురం తిరిగి పునర్నిర్మాణం కావడంతో ఆలయానికి వచ్చే భక్తులు మొదటగా గోపురాన్ని సందర్సించి వెళుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో రథసప్తమి వేడుకలు (Video)