Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాళహస్తి ఆలయ ఉచిత భోజనమా? ఒకసారి తింటే మూడ్రోజులు విరేచనాలే... భయంతో పరుగుపెడుతున్న భక్తులు...!

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ఉచిత అన్నదానసత్రం భోజనమంటేనే చాలామంది భయపడి పోతున్నారు. కారణం భోజనం సరిగ్గా లేకపోవడమే. దేవదాయశాఖ ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఉచిత అన్న ప్రసాదానికి గతంలో ఎంతోమంది భక్తులు వ

Advertiesment
శ్రీకాళహస్తి ఆలయ ఉచిత భోజనమా? ఒకసారి తింటే మూడ్రోజులు విరేచనాలే... భయంతో పరుగుపెడుతున్న భక్తులు...!
, గురువారం, 30 జూన్ 2016 (11:38 IST)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ఉచిత అన్నదానసత్రం భోజనమంటేనే చాలామంది భయపడి పోతున్నారు. కారణం భోజనం సరిగ్గా లేకపోవడమే. దేవదాయశాఖ ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఉచిత అన్న ప్రసాదానికి గతంలో ఎంతోమంది భక్తులు వచ్చేవారు. అయితే ప్రస్తుతం ఉచిత ప్రసాదం తినాలంటేనే భయపడిపోతున్నారు. శ్రీకాళహస్తి ఉచిత భోజనం తినేదాని కన్నా పస్తు ఉండడం మంచిదన్న భక్తులు లేకపోలేదు. 
 
చిత్తూరు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాల వద్ద ఉచిత భోజన వసతిని భక్తుల కోసం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానం పేరుతో భోజన వసతి కల్పిస్తుండటంతో ఆ భోజనం కూడా సరిగ్గా లేదన్న విమర్శలు లేకపోలేదు. ఇక ఏపీలోనే ప్రసిద్ధి చెందిన ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తి భోజనం పరిస్థితి కూడా అదేవిధంగా మారింది. ఒకప్పుడు శ్రీకాళహస్తి ఉచిత భోజనమంటే ఎగిరిగంతేసి భోజనం చేసే భక్తులు ఇప్పుడు ఆ పక్కకు వెళ్ళాంటే భయపడిపోతున్నారు. ఒకసారి భోజనం తింటే రెండు రోజుల పాటు విరోచనాలే. అలాంటి పరిస్థితి. దీంతో శ్రీకాళహస్తి ఉచిత భోజనానికి వెళ్ళే భక్తుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.
 
అసలు ఎందుకు ఇలా అవుతోందంటే భక్తుల సంఖ్య పెరిగినపుడు తదనుగుణంగా సరుకుల దిట్టం పెంచకపోవడంతో రుచి తగ్గి, భోజనం నాసిరకంగా మారుతోంది. శ్రీకాళహస్తి ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆది, సోమవారాల్లో 2 వేల మందికి, రద్దీ సాధారణంగా ఉండే మంగళ, బుధ, గురువారాల్లో 1600 మందికి మధ్యాహ్నం భోజనం వడ్డిస్తారు. రాత్రి 1500 మందికి అన్నప్రసాదం పెడతారు. రద్దీ రోజుల్లో 4 వేల మందికైనా భోజనం పెట్టాలని ఈ మధ్య కాలంలో నిర్ణయించారు కూడా. 
 
అందుకు తగ్గట్టుగానే 2వేల మంది మంది సంఖ్యకు పరిమితం కాకుండా సాధ్యమైనంత ఎక్కువ మందికి భోజనం వడ్డిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. దర్శనానికి వచ్చిన ఒక కుటుంబం బయట ఒక పూజ భోజనం చేయాలన్నా 500 రూపాయలు ఖర్చవుతుంది. అన్న ప్రసాదం వల్ల సాధారణ భక్తులకు ఆ మేరకు డబ్బులు మిగులుతాయి. గతంలో ప్లేటులో భోజనం వడ్డించేవారు. గత కొంతకాలంగా అరటి ఆకుల్లో పెడుతున్నారు. దీనికి భక్తుల నుంచి అభినందలు లభించాయి. ఇదంతా బాగానేవుంది కానీ ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య పెరిగిందనే పేరుతో భోజనంతో నాణ్యతను తగ్గించేశారు.
 
సాధారణంగా 2వేల మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని రద్దీ రోజుల్లో 364 కిలోల బియ్యం, 40కిలోల కందిపప్పు, 20లీటర్ల నూనె, 420కిలోల కూరగాయలు (సాంబారు, తాళింపులకు కలిపి) దిట్టంగా నిర్ణయించారు. ఇతర సరుకులూ ఉంటాయి. గతంలో 2వేల మంది భోజనం చేయగానే టోకెన్లు ఇవ్వడం ఆసేశారు. ఇప్పుడు అలా కాకుండా రద్దీని బట్టి అప్పటికప్పుడు అన్నం సిద్ధం చేస్తున్నారు. సాంబారు, రసం, తాళింపు అలా చేయడం సాధ్యం కాదు కాబట్టి ముందుగానే కాస్త ఎక్కువ పరిణామంలో చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బియ్యం ఇస్తున్నా పప్పు, నూనె, కూరగాయలు, పాలు ఇవ్వడం లేదు. దీంతో భోజనం రుచిలో నాణ్యత తగ్గిపోతోంది. 
 
శ్రీకాళహస్తి అన్నప్రసాదానికి విరివిగా విరాళాలు వస్తున్నాయి. అన్నప్రసాదం ఎక్కువ మందికి వడ్డించాలనుకున్నప్పుడు అందుకు తగినట్లు దిట్టం పెంచడం సరైనది. పాలకమండలి, ఈఓ ఆలోచించి సత్వరమే దిట్టం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షిర్డీ సాయిబాబా తత్త్వమిదే… భక్తుల బాధలు, వ్యాధులు తనవే...