Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య పట్ల విశేషమైన తృప్తి వుండాలి.. పర స్త్రీలపై ఉంటే పాతకం చుట్టుకుంటుంది..

భార్య చేసిన భోజనం.. ఆమె పట్ల భర్త సంతృప్తి చెందాలని శాస్త్రాలు చెప్తున్నాయి. భార్య చేసిన భోజనంతో తృప్తి పడాలి. తన భార్య పట్ల విశేషమైన తృప్తి వుండాలి. అలా కాకుండా పర స్త్రీలపై వ్యామోహం చెందితే పాతకం చు

భార్య పట్ల విశేషమైన తృప్తి వుండాలి.. పర స్త్రీలపై ఉంటే పాతకం చుట్టుకుంటుంది..
, బుధవారం, 3 మే 2017 (17:57 IST)
భార్య చేసిన భోజనం.. ఆమె పట్ల భర్త సంతృప్తి చెందాలని శాస్త్రాలు చెప్తున్నాయి. భార్య చేసిన భోజనంతో తృప్తి పడాలి. తన భార్య పట్ల విశేషమైన తృప్తి వుండాలి. అలా కాకుండా పర స్త్రీలపై వ్యామోహం చెందితే పాతకం చుట్టుకుంటుంది. ఆయుర్దాయం క్షీణిస్తుందని పండితులు అంటున్నారు. అలాగే చేసే ఉద్యోగం పట్ల, తన చేతిలో ఉన్న ధనం పట్ల తృప్తి పడాలి. ఈశ్వరుడు ఏం ఇచ్చాడో దానితోనే బతకడం నేర్చుకోవాలి. ధనం మరింత సంపాదించాలనో ఇతరులను చూసి ఈర్ష్య చెందడం వంటివి వుండకూడదు. ఉన్నంతలోనే సంతృప్తి చెందడం అలవరుచుకోవాలి. 
 
కానీ దానము చేసే విషయంలో మాత్రం తృప్తి ఉండకూడదు. దానం చేసే అవకాశం ఎప్పుడొచ్చినా సద్వినియోగం చేసుకోవాలి. దానం ద్వారా పుణ్య ఫలాన్ని దక్కించుకోవాలి. దానం ద్వారా వచ్చే పుణ్యఫలాన్ని సంపాదించుకోవడంలో సంతృప్తి అనేది చెందకూడదు. అలాగే తపస్సు పట్ల కూడా తృప్తి అనేది ఉండకూడదు. మంచి పుస్తకం చదవడం, మంచి మాటలు మాట్లాడటం, మంచి దైవభక్తి కీర్తనలు వినడం.. కొత్త విషయాలను నేర్చుకోవడం.. ఆ విషయాలను పది మందికి చెప్పడం దీక్ష, తపస్సు లాంటిది. ఇక విద్య పట్ల తృప్తి ఉండకూడదు. ఇంకా చదువుకోవాలి.. చదువుకోవాలి.. అనే తపన ఉండాలి. పుణ్య కార్యాలు చేయడంలో పరమ ఉత్సాహం వుండాలని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలయంలో ఎవరికి పాద నమస్కారం చేయకూడదో తెలుసా?